‘ ఫ్యామిలీ స్టార్ ‘ ఓవర్సీస్ రైట్స్ ని భారీ ధ‌రకు దక్కించు ప్రముఖ బ్యానర్..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్.. పరుశురామ్‌పెట్ల డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాలో విజయ్ స‌ర‌సన మృణాల ఠాగూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే రష్మిక మందన కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తోంది. ఇక గత కొంతకాలంగా రష్మిక మందన, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Official: 'Family Star' Team Offers Entertainment Bonanza on 5th! | Official: 'Family Star' Team Offers Entertainment Bonanza on 5th!

ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ లో రష్మిక మందన నటించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో రౌడీ హీరో.. కామన్ మ్యాన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుపోతున్నాడు. తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ను ప్రముఖ బ్యన‌ర్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందంటూ తెలుస్తుంది. సరిగమ సినిమాస్ బ్యానర్ ఈ హ‌క్కుల‌ను భారీ ధ‌ర‌కు సొంతం చేసుకుంద‌ట‌.

Sarigama Cinemas (@sarigamacinemas) / X

ఈ విషయాన్ని స్వయంగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్ రూపంలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఒకరోజు ముందే యూఎస్ఏ ప్రీమియర్లతో తెర‌పైకి రానుంది. ఏప్రిల్ 4న ఈ సినిమా అక్కడ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు దిల్ రాజ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఎమోషనల్ మూమెంట్స్ తో కూడిన సాధారణ ఫ్యామిలీ డ్రామాగా సినిమా రూపొందుతోందట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా కు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎంత మొత్తానికి కొనుగోలు అయిందనే విషయంపై క్లారిటీ రాలేదు.