ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ‘ ది రాజా సాబ్ ‘ రిలీజ్ ఆ పండ‌గ‌కే ప్రొడ్యూస‌ర్ కామెంట్స్ వైర‌ల్‌..

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలలో ది రాజా సాబ్‌ సినిమా ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన‌ర్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు. బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్ లో కనిపించింది లేదు. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది.

Prabhas Height, Age, Family, Wiki, News, Videos, Discussion & More

ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూస్తారు అంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన‌ సంగతి తెలిసిందే. రాజా సాబ్ సినిమా రిలీజ్ గురించి తాజాగా హింట్ ఇచ్చాడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్. రవితేజ హీరోగా నటించిన ఈగిల్ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది.

Producer TG Vishwa Prasad Interview: Raamabanam is a complete family  entertainer - TeluguBulletin.com

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో సందడి చేసిన విశ్వప్రసాద్.. మాట్లాడుతూ రాజా సాబ్ రిలీజ్ గురించి ఎదురైన‌ ప్రశ్నకు స్పందించాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ విశ్వప్రసాద్ చెప్పుకొచ్చాడు. తేదీని ఫిక్స్ చేసిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని వివరించాడు. దీంతో 2025 సంక్రాంతి బరిలో ప్రభాస్ కూడా అడుగు పెట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ విశ్వ ప్రసాద్ కామెంట్లను వైరల్ చేస్తున్నారు.