14 ఏళ్లకే లైంగిక వేధింపులు.. గుర్తొచ్చినప్పుడల్లా మానసింగా కృంగిపోతున్నా.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాల సక్సెస్‌ల‌తోభారీ క్రేజ్ ద‌క్కించుకుంది. భీద్‌, అఫ్వా, థాంక్యూ ఫర్ క‌మింగ్, ది లేడీ కిల్లర్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం క్రైమ్ థ్రిలర్ బక్షక్ సినిమాలో అలరించబోతుంది. ఈ మూవీలో లైంగిక వేధింపుల నుంచి బాలికలను రక్షించే జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ అమ్మడు తన నిజ జీవితంలో ఎదురైన‌ లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.

14 ఏళ్ల వయసులో ఓ అపరిచిత వ్యక్తి తనపై తప్పుగా ప్రవర్తించాడని.. ఆ సంఘటనను గుర్తుచేసుకుంది. ఆ గాయం నుంచి ఇప్పటికీ బయటపడలేదని.. గుర్తు వచ్చినప్పుడల్లా మానసికంగా కృంగిపోతానంటూ.. వివరించింది. నాకు ఇప్పటికీ ఆ సంఘటన చాలా స్పష్టంగా గుర్తుంది. బాంద్రాలో నా ఎంగేజ్ లో ఉన్నప్పుడు జాతరలు జరుగుతూ ఉండేవి. బహుశా 14 సంవత్సరాల వయసు అనుకుంటా జాతర కోసం నా ఫ్యామిలీ మొత్తం తో కలిసి బయటకు వెళ్ళా. అంతా నడుచుకుంటూ వెళ్తున్న టైంలో నన్ను ఎవరో వెనుక నుంచి గ‌ట్టిగా గిచ్చారు. నా ప్రైవేట్ పార్ట్‌లు టచ్ చేయడానికి ప్రయత్నించారు.

వెనక్కు తిరిగి చూస్తే రద్దీ కారణంగా ఎవరు చేశారో అర్థం కాలేదు. ఎవరో నన్ను పదేపదే అదే విధంగా తాకడానికి ప్రయత్నించారు. ఏదో కోల్పోయినట్లు అనిపించింది. నా వాళ్లంతా నా చుట్టూ ఉన్నా వాళ్ళకి ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితి అంటూ వివరించింది. ఇక గతంలో ఇలానే చిన్న వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అంటూ టాలీవుడ్ నటి నిత్యమీనన్ వివరించిన సంగతి తెలిసిందే. అదే విధంగా చాలామంది నటీమణులు తమ బాల్యంలో తమకు ఎదురైనా వేధింపుల‌ను మీటూ ఉద్యమంలో వివరించారు.