ఆ ఫ్లాప్ డైరెక్ట్ స్టోరీని ఓకే చేసిన చిరంజీవి.. మళ్లీ ఇలాంటి ఎక్స్పరిమెంట్లు అవసరమా బాసు అంటూ..

మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణం అవార్డ్‌తో సత్కరించిన‌ సంగతి తెలిసిందే. దీంతో అటు మెగా ఫ్యామిలీ లోనూ, ఇటు మెగా అభిమానుల్లోనూ సంబరాలు మొదలయ్యాయి. ప్రస్తుతం చిరు బింబిసారా ఫేమ్ వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభ‌రా సినిమాలో నటిస్తున్నాడు. చిరు కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. విజువల్ వండర్, భారీ విఎఫ్‌ఎక్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముల్లోకాల వీరుడుగా చిరంజీవి ఈ సినిమాలో కనిపించబోతున్నాడని టాక్. అయితే చిరంజీవి నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం చిరు క‌థ‌లు లాక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

ఇటీవల అందిన సమాచారం మేరకు రచయిత డైరెక్టర్ బివిఎస్ రవి రీసెంట్గా చిరంజీవికి కథ వినిపించాడట. ఆ స్టోరీ విన్న చిరు చాలా ఎక్సైట్ అయ్యారని.. సినిమా పూర్తి స్క్రీన్ రెడీ చేయమని చెప్పాడ‌ని తెలుస్తుంది. ఒకవేళ ఈ స్క్రిప్ట్ లాక్ అయితే బిబిఎస్ రవి డైరెక్టర్ గా సినిమా తెర‌కెక్కుతుంది. కాగా బీఎస్ రవికి దర్శకుడుగా అంత మంచి పేరు అయితే దక్కలేదు. సాయిధరమ్ తేజ్ తో బివిఎస్ రవి తెర‌కెక్కించిన జవాన్ సినిమా నిరాశపర్చిన‌ సంగతి తెలిసిందే. ఈ స్టోరీ ని డైరెక్ట్ చేసేందుకు ప్రధానంగా ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు హరీష్ శంకర్, మరొకరు కళ్యాణ్ కృష్ణ. ఇద్దరు చిరుతో సినిమా చేసేందుకు ఆసక్తిగా చూస్తున్నారు.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సుష్మిత కొనుదల నిర్మాణంలో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి ఈ బివిఎస్ చెప్పిన కథతోనే ఆ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లతో బాధపడుతున్న చిరంజీవి మరోసారి ఫ్లాప్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏంటి? ఇలాంటి టైంలో ఈ స్టాంట్లు అవసరమా బాసు అంటూ.. పద్మ విభూషణం వచ్చిన‌ ఆనందంతో ఉన్న ఫ్యాన్స్ ను మరోసారి ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా తెరకెక్కించి నిరాశ పరచొద్దు చిరు అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.