ఓవర్సీస్‌లోను అద‌ర‌గొడుతున్న‌ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ‘.. సాలిడ్‌ లెక్క‌లివే..

టాలీవుడ్ యంగ్ యాక్టర్ సుహాస్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కలర్ ఫొటో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుహాస్.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. పలు సినిమాల్లో మెయిన్ లీడ్ లో హీరోగా చేస్తూనే.. తన టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో హార్ట్ హిట్టింగ్ స‌క్స‌స్ అందెకెంటున్నాడు. ఈ సినిమా మొదటి రోజే భారీ వస్తువులను కొల్లగొడుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. యూఎస్ మార్కెట్లను సాలిడ్ గ్రాస్ వ‌సులను కొల్లగొడుతుంది.

ఇక‌ తాజాగా మొదటి రోజు లక్ష డాలర్స్ మార్క్‌ను దాటి మరో పదకొండు వేల డాలర్‌ల‌తో ఒక స్ట్రాంగ్ రన్ సంపాదించుకుంది. దీనితో యూఎస్ మార్కెట్‌లో ముందు రోజుల్లో మరింత బెటర్ వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో సుహాస్‌కు జంటగా శివాని నాగారం నటించింది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన సినిమా గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది.