నా భర్త వ‌ల్లే నేను న్యూడ్‌గా న‌టించా.. సాయి పల్లవి సోదరి సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ యాక్టర్ శరణ్య ప్రదీప్ మొదట ఇండస్ట్రీ లో రిపోర్టర్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఫిదా సినిమాతో నటిగా టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ సినిమాలో సాయి పల్లవి అక్కగా.. అచ్చ తెలుగు ఆడపిల్లగా మెప్పించింది. తెలంగాణ యాసలో మాట్లాడి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో ప‌లు సినిమాల‌లో కీల‌క పాత్ర‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతుంది. కాగా ఇటీవల సుహాస్‌ హీరోగా తెర‌కెక్కిన‌ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండులో హీరో అక్కగా నటించి మెప్పించింది.

ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్‌ అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ‌రణ్య‌ మాట్లాడుతూ సినిమా షూటింగ్‌లో తనకు ఎదురైనా అనుభవాలను షేర్ చేసుకుంది. నేను ఎప్పుడూ నటించని సన్నివేశాల్లో నటించాలంటే నాకు కాస్త భయంగా ఉండేది. న్యూడ్ గా నేను ఇప్పటివరకు ఏ సినిమాలోను నటించలేదు. కాబట్టి నాకు సినిమాలో అలా నటించాలంటే భయం ఉండేది. కానీ నా భయాన్ని పోగొట్టి నా భర్త నాకు సపోర్ట్ అందించాడు.

నువ్వు ధైర్యంగా నటించు అని ధైర్యం చెప్పాడు. అది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటూ నా భర్త నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయనతో పాటు మూవీ యూనిట్ కూడా నాకు సపోర్ట్ గా నిలిచారు. ఆ సీన్స్ చేసేటప్పుడు సెట్ లో ఐదుగురు ఉన్నారు. అయినా నేను న్యూడ్ గా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే నటించాను అంటూ శరణ్య వివరించింది. కాబట్టి నా టింకుకి నేను థాంక్యూ చెప్పాలి అంటూ తన భర్తను ప్రశంసించింది. ప్రస్తుతం శరణ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.