నంది అవార్డుల పేరు మార్పుపై స్పందించిన మెగాస్టార్.. ఏమ‌న్నాడంటే..

ఇటీవల పద్మ విభూష‌న్‌ అవార్డ్ అందుకున్న వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించి ప్రశంసలు తెలియజేసింది. తాజాగా ఆదివారం శిల్పకళా వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోటమరారెడ్డి వెంకటరెడ్డి తదితర రాజకీయ ప్రముఖులు అందరూ ఒకే వేదికపై అవార్డు గ్రహీతలను సత్కరించారు. అలా సత్కారం అందుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇక‌ చిరంజీవికి సన్మానం అయిన తర్వాత మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

చిరు మాట్లాడుతూ అవార్డు ప్రకటన కంటే నాకు ఈ సత్కారం మరింత ఆనందాన్ని కలుగజేస్తుంది అంటూ వివరించాడు. అవార్డ్‌ ప్రకటన తర్వాత ఇలాంటి సన్మానాలు జరగడం నాకు ఇదే మొదటిసారి.. స్వయంగా ప్రభుత్వం చొరవ చూపి తమను సన్మానించడం ప్రశంసించదగిన విషయం అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు నంది అవార్డులను.. గద్దర్ అవార్డులుగా మార్చడం పై స్పందించిన ఆయ‌న వ్యక్తిగతంగా నాకు ఈ డెసిష‌న్‌ చాలా ఆనందాన్ని కల్పిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఎక్కడా కళాకారులను గౌరవిస్తారో ఆ ప్రదేశం ఎల్ల‌పుడుసుభిక్షంగా ఉంటుందని వివరించాడు.

పద్మ విమోషన్ అవార్డ్‌ ప్రకటన చూసి నాకు ఎంతో ఆనందం కలిగిందని.. నా అభిమానుల ఆశీర్వాదం చూస్తుంటే నా జన్మ ధన్యమైన‌ట్లు అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లో వెంకయ్య నాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడు అంటూ వివ‌రించిన‌ చిరు వాజ్‌ప‌యి అంతా హుందాతనం వెంకయ్యనాయుడులో ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. తమను సన్మానించిన ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కాగా నంది అవార్డ్ పేరు మార్పుపై చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.