మెగాస్టార్ చిరంజీవి తన తండ్రితో కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న చిరంజీవి.. ఎన్నో హిట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. పర్సనల్ లైఫ్ లోను ఎంతో మందికి సహాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మెగాస్టార్.. ఫ్యామిలీ గురించి చాలామందికి తెలుసు.

చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కోణిదల వెంకట్రావు – అంజనాదేవి దంపతులకు మొదటి బిడ్డ. ఇక చిరు త‌న చ‌దువును పూర్తి చేశాక పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కెరీర్ ప్రారంభించాడు. ఎన్నో కష్టాలు, అవమానాలు దాటి స్వయంకృషితో మెగాస్టార్‌గా పాపులర్ అయ్యాడు. ఇక చిరు అండ‌తో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది వచ్చి హీరోలుగా సక్సెస్ అవుతున్నారు. నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరంతేజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇలా టాలీవుడ్‌లో మెగా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అయితే చాలామందికి మెగా యాక్టర్స్ అనగానే వీరు మాత్రమే గుర్తుకు వస్తారు. కానీ మెగాస్టార్ తండ్రి కొణిదల వెంకట్రావు కూడా ఓ మూవీలో నటించాడు.

అదే మూవీలో మెగాస్టార్ కూడా నటించడం విశేషం. కాగా చిరు తండ్రి కేవలం పోలీస్ కానిస్టేబుల్ అన్న విషయమే అందరికీ తెలుసు. అయితే ఈయన బాపు దర్శకత్వంలో.. మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో నటించాడు. ఈ మూవీలో చిరంజీవి – పూర్ణిమ భాగ్యరాజ్ జంటగా కనిపించారు. అల్లు రామలింగయ్య ముఖ్య పాత్రలో న‌టించాడు. ఇందులో మంత్రి రోల్ కు సూట్ అయ్యే యాక్టర్ కోసం దర్శకుడు ఎంతో మందిని అప్రోచ్ అయ్యాడట.. ఎవరు సెట్ కాలేదని.. చివరకు రామలింగయ్య చిరంజీవి తండ్రి ఉన్నారు కదా ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేద్దాం అని చెప్పడంతో మేకర్స్ ఆయనను స్క్రీన్ టెస్ట్ చేశార‌ట‌.

అలా చిరు తండ్రి వెంకటరావు ఆ మంత్రి పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని తెలుస్తుంది. ఇక చిరంజీవికి, వెంకట్రావుకు మధ్య ఎలాంటి సన్నివేశాలు లేకపోయినా.. చిరు తన తండ్రితో కలిసి నటించిన ఏకైక సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా 1983లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కాగా మెగా ఫ్యాన్స్ అంతా.. చిరంజీవి తండ్రి నటించిన ఏకైక సినిమా ఇదే కావడం.. అలాగే ఇందులో మెగాస్టార్ కూడా నటించడంతో ఈ న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేస్తున్నారు.