చిన్న వయసులోనే ఆ పని చేశాను.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన పాయల్ రాజ్పుత్…!

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

ఇక ఈమె ఇటీవలే మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకుంది. ఇక దీనిని అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇక తాజాగా పాయల్ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ” 21 ఏళ్లకే మోడలింగ్ మొదలుపెట్టాను.

అందుకు సంబంధించిన ఫోటో నే ఇది. ఓ మ్యాగజైన్ కోసం మొదటిసారి ఫోటోషూట్ చేయించుకున్న. ఢిల్లీలో ఈ షూట్ జరిగింది. తరువాత ముంబైకి షిఫ్ట్ అయ్యాను ” అంటూ ఆ పోస్ట్ కింద రాసుకు వచ్చింది పాయల్. ప్రస్తుతం ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ ని చూసిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు.