స్కూల్ లో వేధింపులను అనుభవిస్తున్న సానియా మీర్జా పిల్లలు.. పాపం అంటున్న ప్రేక్షకులు..!

ఇటీవల సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా షోయబ్ రెండో వివాహం కూడా చేసుకున్నాడు. ఇక వీరిద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నప్పటికీ సానియా, షోయబ్ లకు పుట్టిన పిల్లలు ఇజాన్ తండ్రి మూడవ వివాహం కారణంగా స్కూల్లో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు తన తల్లిదండ్రుల కారణంగా ఇజాన్ మానసిక శోభ కి గురవుతున్నారని పాక్ మీడియోలో ప్రచారం జరుగుతుంది. కానీ వాటి గురించి ఇప్పటివరకు సానియా స్పందించలేదు. ఇక దీనిపై ప్రేక్షకులు స్పందిస్తున్నారు.

” భార్య ,భర్తలు విడిపోతే ఆ ప్రభావం బిడ్డలపై పడుతుంది. వీరు చేసిన తప్పుకి తమ పిల్లలు శోభ అనుభవించాల్సి వచ్చింది. వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇలాంటివారు ఎందుకు పెళ్లిళ్లు చేసుకుంటారో కూడా అర్థం కాదు. పెళ్లి చేసుకుని విడిపోయే వారికి ఇదొక లెసన్ అని చెప్పొచ్చు ” అంటూ విరుచుకుపడుతున్నారు ప్రేక్షకులు.