ఆ మాస్ డైరెక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. కొన్ని పార్ట్ 2 సినిమాలు, కొందరు డైరెక్టర్లు వెయిటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి బిజీ లైనప్‌లో ఏ సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభాస్ నుంచి మరో మైండ్ బ్లోయింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ప్రభాస్ మరో సినిమాకు సైన్ చేశాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ ఊర‌మాస్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆయన ఎవరో కాదు మాస్‌ సినిమాలకు తన మార్క్‌ క్రియేట్ చేసుకున్న బోయపాటి శీను. వీళిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Prabhas in 2023 | South Film Star

ప్రభాస్ తో భారీ మూవీని ప్లాన్ చేశాడట బోయపాటి. యాక్షన్ సినిమాలు చేయడంలో బోయపాటి దిట్టన సంగతి అందరికీ తెలుసు.. ఆయన హీరోని ఎలివేట్ చేస్తే విధానం వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రభాస్ లాంటి కటౌట్ దొరికితే ఇక వెండితెరపై మాస్ ర్యాంపేజ్ ఏ లెవ‌ల్‌లో ఉంటుందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక ఈ సినిమా ప్రయత్నాల్లోనే బోయపాటి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి భారీ పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క మారుతి రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.

Prabhas with Boyapati: బోయపాటి శ్రీనుతో ప్రభాస్‌ సినిమా?.. వామ్మో ఇదెక్కడి రచ్చ..

అలాగే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా సిట్స్‌ పైకి రానుందట. హను రాఘవపూడి తో కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ఇవనీ కాకుండా ప్రశాంత్ నీల్‌తో సలార్2 చేయాల్సి ఉంది. దీంతో బోయపాటి మూవీ ఇప్పట్లో అయితే ఉండే అవకాశం లేదు. అలానే వీరిద్దరి కాంబోలో తెరకెక్కించాలని చూస్తున్న మూవీ ఇంకా చర్చల దశలోనే ఉందట. ఫైనల్ అయ్యే ఛాన్స్‌లు చాలా వరకు ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతుందని వార్తలు రావడంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.