ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పిన స్టార్ హీరోయిన్.. తల్లి కాబోతున్న ప్రభాస్ బ్యూటీ..

బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా గడుపుతున్న ఏమే పాన్ ఇండియా కమర్షియల్ సినిమాల్లో కూడా నటిస్తూ దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంటుంది. అలాగే టాలీవుడ్ క్రేజీ పాన్ ఇండియన్‌ ప్రాజెక్ట్.. ప్రభాస్ కల్కి 2898 ఏడి లోనూ దీపిక నటిస్తుంది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెలబ్రిటీ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Is Deepika Padukone expecting her first child? 'Piku' star's attempt to cover midriff at BAFTAS triggers pregnancy rumours - The Economic Times

దీపిక త్వరలోనే తల్లి అవుతుందంటూ సన్నిహిత వర్గాల నుంచి వీక్ రిపోర్ట్ అందుతుంది. ఇక రణ్‌వీర్ సింగ్, దీపికా 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పెళై అయిదేళ్ల అవుతున్న ఇంతవరకు పిల్లలు లేకపోవడంతో ఆమె ఎక్కడికి వెళ్లినా తరచూ అదే ప్రశ్న ఎదురవుతుంది. బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్, దీపికా స్టార్ కపుల్ మ్యారేజ్ తర్వాత.. మ‌రో సెలబ్రిటీ కపుల్ అయ్యిన ర‌ణ్‌బీర్, ఆలియా ఇప్పటికే పేరెంట్ స్టేటస్ అందుకోవడంతో.. వీరికి ప్రశ్నలు మరింత ఎక్కువయాయి. రీసెంట్గా బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్.. 77వ‌ అవార్డ్స్ ఈవెంట్ కు హాజరైన దీపిక పదుకొనే.. ఇందులో ప్రజెంటర్గా వ్యవహరించింది. ఈ ఈవెంట్లు దీపిక భారతీయత ఉట్టిపడేలా సబ్య‌సాచి చీరలో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసింది.

Deepika Padukone and Ranveer Singh ⋆ Reena.nl

అయితే బేబీ బంప్ కనిపించకుండా ఉండేందుకే ఫుల్ హుడి దీపికా ధరించిందంటూ తెలుస్తుంది. దీపిక ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రిమిస్టర్ లో ఉందట. కాగా ప్రస్తుతం దీపిక ప్రెగ్నెన్సీ తో ఉండడంతో సీజన్ 3 నుంచి తప్పుకున్నట్లు సినీ వర్గాల టాక్. ఇక ఇటీవ‌ట జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో దీపిక మాట్లాడుతూ నాకు, ర‌ణ్‌వీర్‌కి పిల్లలంటే చాలా ఇష్టమని.. మేము కూడా త్వరలోనే ఫ్యామిలీని మొదలుపెట్టే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ కామెంట్లు చేసింది. ఇంతలోపే ఆమె తల్లి కాబోతున్నట్టు వార్తలు వినిపించడంతో.. ఈమె చేసిన కామెంట్లకు మరింత బలం చేకూరింది. ఇక దీపిక పదుకొనే ఈ వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Deepika Padukone dazzles in shimmer! Stunning BAFTA 2024 saree look (Photos Inside)