“పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష..బూతు కామెంట్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ పై చీప్ కామెంట్స్ ..వల్గర్ కామెంట్స్ చేయడం మనం ఎక్కువగా చూస్తున్నాం . ఎవరైనా పబ్లిసిటీ అవ్వాలి అన్న పాపులారిటీ సంపాదించుకోవాలి అన్న లేకపోతే వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేయాలి అన్న జనాలు ఇదేవిధంగా ముందుకు వెళ్తున్నారు. టాప్ మోస్ట్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ పిచ్చి పదాలతో మాట్లాడితే కచ్చితంగా ఓవర్ నైట్ లో స్టార్ గా అయిపోతున్నారు. రీసెంట్గా హీరోయిన్ త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో మనం చూసాం.

ఆ తర్వాత తలపోగురు దిగి సారీ చెప్పాడు. ఇప్పుడు రీసెంట్గా మరో లీడర్ అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు. అన్నడిఎంకె లీడర్ హీరోయిన్ త్రిషపై చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి . ఆయన మాట్లాడుతూ..” గతంలో ఈవెంట్ లో పాల్గొన్న ఓ పెద్ద బడ పొలిటీషియన్ త్రిషపై మోజు పడ్డాడు అని.. ఒక నైట్ కి 25 లక్షలు ఇచ్చి ఆమెతో ఎంజాయ్ చేశాడు అని చెప్పుకొచ్చాడు “.

దీనితో కోలీవుడ్ మీడియా ఒక్కసారిగా షాక్ అయిపోయింది . పేరుతో సహా బయట పెట్టడంతో సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . అయితే త్రిషపై అతి ఛండాలంగా చేసిన ఈ వ్యాఖ్యలు చెత్త గా ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. త్రిష కూడా రెస్పాండ్ అయింది. ” అటెన్షన్ గ్రాబ్ కోసం వెధవలు ఏవేవో చేస్తుంటారు . అందరికీ నేను ఆన్సర్ ఇవ్వలేను . ఇకపై చట్టంతో పోరాడుతాను.. చట్టపరంగా పోరాడుతాను .. న్యాయమే గెలుస్తుంది ” అంటూ తనదైన స్టైల్ లో ట్విట్ చేసింది. త్రిష ఫ్యాన్స్ పోరంబోకు వెధవలు ఇలాగే మాట్లాడుతారు మేడం అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు…!!