మిర్రర్ ముందు వాటిని చూపిస్తూ హీటెక్కిస్తున్న వెంకీ బ్యూటీ.. ఆ టెక్నిక్ ఏంటో చెప్పమంటూ..

స్టార్ బ్యూటీ రితిక సింగ్‌కు తెలుగు ప్రేక్షకుల‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో నటించింది త‌క్కువ సినిమాల‌లోనే అయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వెంకటేష్ స‌ర‌స‌న గురు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె.. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టు సద్వినియోగం చేసుకుంటుంది.

వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుసగా సినిమాల్లో నటిస్తూన్న ఈ బ్యూటీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో కూడా దర్శనమిస్తూ వరుస పోస్టులను పెడుతూ ఆకట్టుకుంటుంది. తన బ్యూటిఫుల్ లుక్స్ తో అదరగొడుతున్న ఈమె ట్రెండీ వేర్ లోనే కాకుండా.. ట్రెడిషనల్ వేర్ లోను కుర్రాళ్లను కవ్విస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ ఫోటోను షేర్ చేసుకుంది రితిక.

క్రాప్డ్ స్లీవ్ లెస్ బనియన్, బ్లూ డెనిమ్ జీన్స్ ధరించి మిర్రర్ ముందు బ్యాక్ అందాలు ఆరబోస్తూ మొబైల్ లో ఫోటో తీసుకుంది. ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకోవడంతో ఈ పిక్స్ నెట్టింట‌ తెగ వైరల్‌గా మారాయి. కొంత మంది బ్యాక్ స్ట్రక్చర్ తో పాటు.. ఫిజిక్ కూడా చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఫిట్నెస్‌ను అలా మెయింటైన్ చేసేందుకు టెక్నిక్ ఏంటో కాస్త చెబుతారా మేడం అంటూ.. సో హాట్ లుక్ అంటూ.. క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ రజినీకాంత్ తలైవ‌ర్‌ 170లో కి రోల్ లో నటిస్తోంది.