“అ పని చేస్తే నన్ను చంపేస్తారు”.. హీట్ పెంచేస్తున్న వరుణ్ తేజ్ డేరింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న సినిమా “ఆపరేషన్ వాలంటైన్”. పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వరుణ్ తేజ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది . పాన్ ఇండియా లెవెల్ లో ఆయనకు ఈ సినిమా పాపులారిటీ తీసుకొస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఫస్ట్ రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకుని ఉన్నారు జనాలు .

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు . అదే మూమెంట్లో రిపోర్టర్స్ పవన్ కళ్యాణ్ సినిమాలో మీరు విలన్ పాత్ర పోషించే ఛాన్సెస్ ఉన్నాయా ..? అంటూ ప్రశ్నించారు . దీనికి వరుణ్ తేజ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు . అలా చేస్తే నన్ను చంపేస్తారు అంటూ ఓపెన్ గా ఉన్న విషయాన్ని చెప్పాడు .

నిజమే ఒక మెగా హీరో సినిమాలో మరొక మెగా హీరో విలన్ గా నటిస్తే ఎవరు ఒప్పుకుంటారు ..? చెప్పండి అంటూ మెగా ఫ్యాన్స్ వరుణ్ ఆన్సర్ ని స్వీకరిస్తున్నారు . మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయ్. రీసెంట్ గానే లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వరుణ్ తేజ్ . పెళ్లి తర్వాత ఓ పక్క ఫ్యామిలీ లైఫ్ ను మరొకపక్క ప్రొఫెషనల్ లైఫ్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నాడు..!!