రామ్ చరణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. గేమ్ చేంజర్ స్టోరీకి మోటివేషన్ ఆ ఆఫీసర్ లైఫ్ స్టోరీనా..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్‌. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ కొత్త‌ షెడ్యూల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన స్పెషల్ సెట్ లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు అన్బరీవ్. మార్చ్ మొదటి వారం వరకు షూటింగ్ ఇక్కడ జరగనుంది. రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాకు త‌గ్గ రేంజ్‌లో తెర‌కెక్కుతున్న మరో పాన్ ఇండియా సినిమా ఇది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

చరణ్ పాత్ర పేరు రామ్‌నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా ఈ పాత్రకు రామ్‌నందన్ అనే పేరు పెట్టారట. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్‌నందన్ అనే ఓ ఐఏఎస్ అధికారి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తారు. ఈయన తెచ్చే మార్పులతో పొలిటీషియన్స్ గోలెత్తిపోతారు. గ‌తంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవిలో పనిచేసి దేశంలో రాజకీయ నాయకులకు చెమటలు పట్టించిన టీఎన్ శేషన్ జీవిత కాలనీ కొన్ని ఎపిసోడ్స్ ఈ సినిమాలో తీసుకున్నట్లు తెలుస్తుంది. దేశ ఎలక్షన్ రంగంని రాడికల్ రిఫార్మ్ చేసిన వ్యక్తిగా శేషన్ గుర్తుంపుతెచ్చుకున్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు అని చాలామంది రాజకీయ నాయకులు చెబుతారు. కానీ శేషన్ మాత్రం దానిని చేసి చూపించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకున్నాడు.

Major leak from Ram Charan's 'Game Changer' shocks director Shankar and his  team! - Tamil News - IndiaGlitz.com

వాటిలో కొన్ని.. అర్హులైన ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులను అందించడం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుపై ఒక లిమిట్, ప్రగతిశీలమైన స్వాతంత్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల నిర్వహణకు వేరే రాష్ట్రాల అధికారులను నియమించి ఎలక్షన్స్ నిర్వహించడం, అలాగే ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా డబ్బు, మద్యం లాంటివి జనానికి పంచకుండా అడ్డుకోవడం.. ప్రచారం కోసం అధికారిక యంత్రాంగాల వినియోగాన్ని కంట్రోల్ చేయడం, కులం, మతం పేరుతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను అడ్డుకున్నాడు. ప్రార్థన స్థలాలు, దేవాలయాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిషేధించి.. ఎన్నికల కోసం వాడే లౌడ్ స్పీకర్లకు ముందస్తు అనుమతి.. రాత్రి ప‌ది గంటలకే ఎన్నికల ప్రచారం ముగించడం. పోలింగ్ టైం లో పోలింగ్ బూత్ పరిసరాల్లో పార్టీల గుర్తులు, జెండాలు, బొమ్మలు కనిపించకుండా ఆపేయడం.. లాంటి ఎన్నో కట్టుదిట్టమైన నిబంధనలో అమలు చేయించాడు.

Game Changer: The Ram Charan-Shankar biggie won't release in summer 2024;  here's when it will be out

ఈ నియ‌మావ‌ళి అమలు చేయడం కోసం రాజకీయ పార్టీలతో పెద్ద యుద్దమే చేశాడు శేషన్‌. మధ్యప్రదేశ్ నియోజకవర్గంలో అప్పటి గవర్నర్ తన కుమారి గెలుపు కోసం ప్రచారం మొదలుపెట్టాడు. దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికలను శేషన్ వాయిదా వేయించాడు. చివరికి ఆ గవర్నర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఉత్తరప్రదేశ్లో ప్రచార గడువు ముగిసిన కొన్ని క్షణాలకు ఓ మంత్రి వేదిక నుంచి దిగాల్సి వచ్చింది. టిఎన్ శేషన్ పనితీరు ప్రజాస్వామ్యానికి సాధారణ ప్రజలకు దళితులకు అందరికీ ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక‌ రామ్ చరణ్ గేమ్ చేంజ‌ర్‌ సినిమాతో మరోసారి ఆయన్ని గుర్తు చేస్తున్నారంటూ తెలుస్తుంది. ఇక‌ శంకర్ గతంలో తీసిన ఒకే ఒక్కడు సినిమాల కూడా ఈ సినిమా ఉండబోతుందట. కార్తీక్ సుబ్బరాజు రాసిన ఈ స్టోరీ కొత్తగా ఉండడమే కాదు.. మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతుంది.

Game Changer : గేమ్ చెంజర్‌ని హ్యాండిల్ చేయలేనని.. స్టోరీ వదులుకున్న స్టార్  డైరెక్టర్.. ఎవరు అతను..? | S shankar ram charan game changer story news  gone viral-10TV Telugu

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలను.. ప్రజాసంయవాదం, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వారిని తీవ్రంగా బాధిస్తుంది. అందుకే న్యాయస్థానం కూడా మ‌రోసారి శేషన్ లాంటి సమర్ధుడి కోసం అన్వేషిస్తుంది. ఇలాంటి టైం లో ఈ కథ జనాలకు వస్తే కచ్చితంగా నచ్చే అవకాశం ఉంది. అయితే దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇప్పటివరకు రిలీజ్ డేట్ పై క్లారిటీ రాలేదు. కాగా ఇటీవల సలార్‌ సినిమాను థియేటర్లో చూసేందుకు వచ్చిన దిల్‌రాజు అక్కడ అభిమానుల ప్రశంసలు అందుకోవడంతోపాటు.. గేమ్ చేంజర్ సెప్టెంబర్ లోనే రిలీజ్ అవుతుంది అంటూ కన్ఫామ్ చేశాడు. కాగా అదే నెలలో పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ ఉండడం తో ఇప్పుడు మళ్లీ గేమ్ చేంజర్ రిలీజ్ సెప్టెంబర్ లో ఉంటుందా.. లేదా ప్రశ్నార్థకంగా మారింది.