ప్రియుడితో పెళ్లికి రెడీ అయిన జాన్వి కపూర్.. ముహూర్తం ఎప్పుడంటే..?!

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది జాన్వి కపూర్. బాలీవుడ్‌లో ధడక్ సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఆ తర్వాత మరో సినిమాలో నటించి భారీ హీట్న తన ఖాతాలో వేసుకుంది. కాగా త‌ర్వాత ప‌లు సినిమాలో న‌టించిన స‌క్స‌స్ రాలేదు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న దేవరా సినిమాతో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ సినిమా స‌క్స‌స్ అయ్యితే ఆమె క్రేజ్ పెరుగుతుంది అన‌టంలో ఎలాంటి సందేహంలేదు. ఈ సినిమా తర్వాత జాన్వి.. రామ్ చరణ్ తో మరో సినిమాలో నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక వరుస షూటింగ్లలో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ కుర్రాలలో హీట్ పెంచేస్తుంది. ఇక ప్రస్తుతం జాన్వి కపూర్ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. జాన్వి కపూర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తన ప్రియుడుతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుందంటూ బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో జాన్వి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు.

ఇక జానీ కాలేజ్ టైం నుంచే తనతో ఎంతో స్నేహంగా మెదులుతున్న శిఖర్ పహారియాతో లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారి చట్టపట్టలేసుకొని పబ్లు, పార్టీలు, షికార్లు అంటూ తిరగడమే కాకుండా.. ఇప్పటికే పలు పుణ్యక్షేత్రాలకు జంటగా కూడా వెళ్లారు. వీరిద్దరి కుటుంబాల మధ్య మంచి సంబంధం ఉండడంతో ఇరుకుటుంబాలు పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వచ్చే ఏడాది వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని టాక్. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.