“సీరియల్ కి ఎక్కువ ..సినిమాకి తక్కువ”..నాని “హాయ్ నాన్న” మూవీ పై స్టార్ హీరో కౌంటర్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని తాజాగా నటించిన సినిమా “హాయ్ నాన్న”. శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నేడు రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . సినిమాలో నాని యాక్టింగ్ కి జనాలు ఫిదా అయిపోయారు. మరీ ముఖ్యంగా పాప టూ టాలెంటెడ్ గా నటించింది . ప్రతి సీన్ లో ఎమోషన్ తో కట్టిపడేసింది .

నాని హాయ్ నాన్న సినిమాకు సంబంధించి కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . సినిమా మరి స్లోగా వెళుతుంది అని ..ఎక్కడా.. కూడా సస్పెన్స్ . ఆశ్చర్యపోయే అంత సీన్స్ లేవని .. ఏదో ఒక సీరియల్ లాగా వెళ్ళిపోతూ ఉంటుందని ..నాని అభిమానులకు ఈ సినిమా నచ్చింది తప్పిస్తే మిగతా వాళ్లకు పెద్దగా నచ్చదు అని కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో కూడా ఇలాంటి కామెంట్స్ చేశారట .

తన ఇంట్లో వాళ్ళు “హాయ్ నాన్న” సినిమాకు వెళ్దాము అని అడగ్గా ..”సీరియల్ కి ఎక్కువ సినిమాకి తక్కువ ..ఆ సినిమాను మనం థియేటర్కు వెళ్లి చూడాలా ..?” అంటూ కౌంటర్స్ వేయడమే కాకుండా నాని ను అవమానించినట్లు మాట్లాడారట . అయితే ముందు నుంచి ఈ హీరోకు నాని కు అస్సలు పడదు అన్న విషయం అందరికీ తెలిసిందే . మరి అలాంటి టైం లో ఇలాంటి కామెంట్స్ చేయడం నిజంగానే నాని అభిమానులకు మండిపోయేలా చేస్తుంది..!!