ఓవ‌ర్‌సిస్‌లో ” హాయ్ నాన్న ” హ‌వా.. నాని క్రేజ్‌ మాములుగా లేదుగా..!!

నాచురల్ స్టార్ నాని హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా… శృతిహాసన్ ముఖ్య పాత్రలో నటించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ” హాయ్ నాన్న “. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక డీసెంట్ బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

నాని ప్రతి సినిమాకి కూడా యూఎస్ మార్కెట్ లో మంచి నెంబర్స్ ప్రీమియర్స్ తోనే మొదలవుతాయి. ఇక దీంతో మరోసారి నాని తన స్టాండర్డ్ కనబరిచాడు. ఇక ఈ సినిమాకి యూఎస్ లో జస్ట్ ప్రీమియర్స్ తోనే 2 లక్షల 50 వేలకి పైగా డాలర్స్ ని రాబట్టింది.

ఇంకా ఈ సినిమా కౌంట్ అవుతున్నట్లుగా యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. ఇక మొత్తానికి యూఎస్ మార్కెట్ లో ఓపెనింగ్స్ తో నాని తన మాస్ చూపించాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా… వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.