గ్రాండ్ లెవెల్ లో జరిగిన దగ్గుబాటి అభిరామ్ మ్యారేజ్ సెలబ్రేషన్స్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..!!

టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు… రానా తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్ కి పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇక అభిరామ్ ” అహింస ” అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమా అభిరామ్ కి అనుకున్నంత ఫలితం అయితే ఇవ్వలేదు. దీంతో అభిరామ్ తన రెండో సినిమాని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే వరుసగా కథలు వింటున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే… నిన్న రాత్రి అంటే డిసెంబర్ 6న శ్రీలంకలోని ఓ ఫంక్షన్ హాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా అభిరామ్ పెళ్లి జరిగింది. అతి తక్కువ మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక అభిరాం భార్య పేరు ప్రత్యూష. ఈమె సురేష్ బాబు కుటుంబానికి దూరపు బంధువు అని సమాచారం.

అభిరామ్, ప్రత్యూష… వరుసకు బావ, మరదలు అవుతారట. ఇక మూడు రోజులపాటు వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభోగంగా శ్రీలంకలో జరిగింది. ఇక ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో అభిరామ్, ప్రత్యూష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరి ఫోటోలను చూసిన ప్రేక్షకులు… జంట చూడముచ్చటిగా ఉంది… అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో వీరి రిసెప్షన్ ఈవెంట్ ని కూడా జరుపుకోనున్నట్లు తెలుస్తుంది.