మెగా కోడలు  ఉపాసన ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా ..మనకి ఒకరంటే ప్రత్యేకంగా ఇష్టపడతాం. అది ఎవరైనా కానివ్వండి. ఏ స్టార్ హీరో అయినా.. హీరోయిన్ అయినా.. మనకి అంటూ ఓ ఫేవరేట్ హీరో ఉంటారు.  కాగా సినిమా ఇండస్ట్రీలో సగానికి పైగా మెగా హీరోలు ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు మాత్రం ఆ తెలుగు హీరో అంటే తెగ ఇష్టమట .

అతడు మెగా ఫ్యామిలీ హీరోల లిస్టులో లేకపోవడం గమనార్హం.  ఆ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్ . మొదటి నుంచి ఉపాసనకు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు అంటే చాలా చాలా ఇష్టమట . అందుకే విక్టరీ వెంకటేష్ నటనకు బాగా కనెక్ట్ అయింది . అంతేకాదు ఆమె ఇప్పటికీ ఆయన నటించిన సినిమాలు  టీవీలో చూస్తూనే ఉంటుందట.  మరీ ముఖ్యంగా “కలిసుందాం రా “.. “జయం మనదేరా”..

లాంటి సినిమాలు ఆమెకు బాగా నచ్చుతాయట . అందుకే ఇప్పటికీ వెంకటేష్ నటించిన పాత సినిమాలను చూసి టైం పాస్ చేస్తూ ఉంటుందట ఉపాసన . ప్రజెంట్ ఇదే న్యూస్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఇండస్ట్రీలో అంత మంది హీరోలు ఉన్న ఉపాసనకి వెంకటేష్ నటన మాత్రమే నచ్చడం సో స్పెషల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!