హౌస్ లో ఫస్ట్ కెప్టెన్ గా రైతుబిడ్డ.. హౌస్ నుంచి వెళ్ళిపోతానంటూ రచ్చ చేసిన అమర్ దీప్..!!

బిగ్‌బాస్ సీజన్ 7 ఈవారం మరింత రసవతరంగా కొనసాగుతుంది. ఓవైపు లెటర్స్ త్యాగం తో ఎమోషనల్ గా కొనసాగినా ఈ ఎపిసోడ్.. మరోవైపు క్యాప్టెన్సీ టాస్క్ కోసం పోరాటంగా సాగింది. కెప్టెన్సీ టాస్క్ పీక్స్ లోకి వెళ్ళింది. కొట్టుకునేంతవరకు వెళ్లారు. మొదట హౌస్ లో హౌస్ మేట్స్ కి వారి ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చాయి. జంటలుగా ఉన్న హౌస్ మేట్స్ లో ఇద్దరిలో ఒకరు మాత్రమే లెటర్స్ చదవాలంటూ బిగ్ బాస్ చెప్పడంతో మరొకరు త్యాగం చేయాల్సి వచ్చింది. సందీప్ కోసం అమర్ దీప్ లెటర్ త్యాగం చేశాడు. అందుకు అమర్ బాగా ఎమోషనల్ అయ్యాడు.

సందీప్ కూడా కంటతడి పెట్టాడు. వీరిద్దరి సన్నివేశాలు అందరినీ ఏడిపించేశాయి. మరోవైపు శివాజీ పల్లవి ప్రశాంత్‌ల వంతు వచ్చినప్పుడు తన భార్య పంపిన కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యాడు శివాజీ. ప్రశాంత్ కోసం తన లెటర్ త్యాగం చేశాడు. అంతేకాదు ప్రశాంత్ కి ఇన్స్పైరింగ్ వ‌ర్డ్స్ చెప్పాడు. నువ్వు హౌస్ లో ఉండాలని.. ఒక రైతుబిడ్డ ఈస్థాయికి వచ్చాడంటే అంతా గొప్పగా మాట్లాడుకోవాలని.. కెప్టెన్ కావాలని అదే తనక కోరుకుంటున్నాను అని తనకోసం ఏదైనా చేస్తానని చెప్పుకొచ్చాడు శివాజీ. శివాజీ త్యాగానికి కన్నీళ్లు పెట్టుకున్న ప్రశాంత్ తన ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్ చదువుకొని ఆనంద భాష్పాలతో మునిగిపోయాడు.

అయితే తన త్యాగం చేయడం వల్ల అమర్దీప్ ఎంతగానో బాధపడడం ప్రేక్షకులందరిని కదిలించింది. వైట్ ష‌ర్ట్‌పై ఎక్కువ కలర్స్ ఉంటే వాళ్ళు అవుట్.. తక్కువ కలర్స్ ఉంటే వాళ్ళు విన్నర్ అని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ గేమ్‌లో తేజ, సందీప్, ప్రశాంత్, గౌతమ్ పాల్గొన్నారు, మొదటి రౌండ్లో తేజ, రెండో రౌండ్లో సందీప్ ఔట్ అయ్యారు. మూడో రౌండ్లో ప్రశాంత్, గౌతమ్‌ మిగిలారు. వీరిద్దరి మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. కొట్టుకునే వ‌ర‌కు వెళ్లారు. చివరికి అత్యంత ఉత్కంఠ భ‌రితమైన పోరులో కొద్దిపాటి కలర్ తక్కువతో ప్రశాంత్ విన్నర్ అయ్యాడు.

ఏడో సీజన్‌లో రైతుబిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఫస్ట్ కెప్టెన్గా నిలిచి కొత్త రికార్డును సృష్టించాడు. అయితే ఈ గేమ్ మధ్యలో సందీప్ హడావిడి చేశాడు. ప్రశాంత్‌నా టీ షర్ట్ లాగాడని గొడవ చేశాడు. సంచాలకుడిగా ఉన్న ప్రియాంకని నిలదీశాడు. అలాగే తేజ కూడా చేశాడు. మరోవైపు ప్రశాంత్‌కి శివాజీ సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అమర్ ఫైర్ అయ్యాడు. నేను వెళ్ళిపోతా ఆడియో చెప్పేది కరెక్ట్ అయితే నేను హౌస్ నుంచి వెళ్ళిపోతా అంటూ బెదిరిస్తూ, అరిచాడు. తన బాధను వ్యక్తం చేస్తూనే అరవడం కాస్త ఓవరాక్షన్ గా అనిపించింది. ఫైనల్గా రైతు బిడ్డ తొలికాప్టన్ అవ్వడం ఎపిసోడ్‌కే హైలెట్ అని చెప్పాలి.