లాస్ట్ మినిట్ లో మెగా ఫ్యామిలీకి ట్విస్ట్ ఇచ్చిన లావణ్య తల్లి..!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. నవంబర్ 1వ‌ తేదీన పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న ఈ జంట.. ప్రస్తుతం మ్యారేజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ అనంతరం పెళ్లి పై అనేక పుకార్లు వచ్చాయి. ఇదే క్రమంలోనే ఈ జంట వివాహానికి సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేంటంటే.. వరుణ్ ,లావణ్య పెళ్లికి నిహారిక రావడంలేదని వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. కాగా దీని వెనుక బలమైన కారణం ఉందట. లావణ్య కుటుంబం చాలా డీసెంట్ ఫ్యామిలీ. వీరికి గొడవలు అంటే చాలా భయం అట. అయితే లావణ్య పెళ్లికి వచ్చిన వాళ్లు నిహారికను చూసి.. తన కూతురు లైఫ్ కూడా అలాగే అయిపోతుందని ఎక్కడ ట్రోల్స్ చేస్తారో అని భయం అట.

దీంతో నిహారికను పెళ్లికి రాకూడదని మెగా ఫ్యామిలీకి కండిషన్ పెట్టారట లావణ్య తల్లి. ఇక నిహారికతో పాటు శ్రీజ కూడా ఈ పెళ్లికి హాజరు కాకూడదని అన్నారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో వరుణ్, లావణ్య ల పెళ్లి వరకు వేచి చూడాల్సిందే.