హీరో ఒడిలో పడిపోయిన హీరోయిన్.. చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యానన్న‌ బ్యూటీ..

లెజెండ్రీ యాక్టర్ దేవ్ ఆనంద్ ” జానీ మేరా నామ్ ” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హేమ మాలిని.. షూటింగ్ టైంలో ఎన్నో ఇబ్బందికరమైన క్షణాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. ఈమె అందం, నటనతో ఎంతోమంది అభిమానులని ఆక‌ట్టుకుంది.

మరి ఈ బ్యూటీకి అంత ఇబ్బందికరమైన క్షణాలు ఏంటో తెలుసా?..” ఓ మేరే రాజా ” పాట చిత్రీకరణ సమయంలో ముందుగా దేవ్ ఆనంద్ ఒక చెయిర్ పై కూర్చోవాల్సి ఉంటుంది.. ఆ తర్వాత మరో చెయిర్ లో తను కూర్చోవాలనేది డైరెక్టర్ ప్లాన్. కానీ అది మిస్ కావడంతో హీరో ఒడిలోకి వెళ్లిపోయానని తెలిపింది హేమ మాలిని.

ఈ సంఘటనతో రియల్ లైఫ్ తో పాటు.. రీల్ లైఫ్ లోను చాలా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యానని తెలిపింది. ” దేవ్ అనంద్ ” 100వ జయంతి సందర్భంగా ఈ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంది. హేమా మాలిని వయసు పెరుగుతున్న అందం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదంటున్నారు ప్రేక్షకులు. ఇప్పటికీ చిన్న పిల్లలాగే ఉన్నారంటూ తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం హేమ మాలిని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.