కెరీర్ ఆరంభంలో ఆఫ‌ర్ల కోసం నేనూ ఆ ప‌ని చేశా.. వైర‌ల్ గా మారిన‌ ర‌కుల్ కామెంట్స్‌!

రకుల్ ప్రీత్ సింగ్.‌. ఈ ఢిల్లీ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మోడల్ గా కెరీర్‌ ప్రారంభించిన రకుల్.. `గిల్లి` అనే కన్నడ మూవీతో 2009లో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కెరటంతో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్.. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగులో టాప్ హీరోలతో జతకట్టింది.

అలాగే కోలీవుడ్ లోనూ మంచి ఇమేజ్‌ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్‌.. ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ర‌కుల్‌.. కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న క‌ష్టాల‌ను పంచుకుంది. `చిన్న వయసు నుంచి నాటి కావాలని కలలు కన్నాను. సినిమా ఇండస్ట్రీ గురించి ఏం తెలుసుకోకుండానే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించాను.

ఆ తర్వాత ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేందుకు పేరెంట్స్ ను వ‌దిలేసి ముంబై వ‌చ్చేశాను. ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూశాను. ఈ రంగంలో రాణించ‌డం అంత సుల‌భం కాదు. ముఖ్యంగా న‌టీమ‌ణులు ఎన్నో అగాధాల‌ను ఎదుర్కొన్న త‌ర్వాత స‌క్సెస్ అవుతారు. ఇందుకు తానూ మిన‌హాయింపు కాదు. ఆరంభంలో నేను కూడా ఆఫ‌ర్ల కోసం సినిమా ఆఫీసుల ముందు క్యూలో ప‌డిగాపులు కాశాను. కాస్టింగ్ ఏజెంట్ల‌కు ఫోన్లు చేసేదాన్ని. ఒక్కోసారి వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి ఆఫ‌ర్లు చేజారేయి. ఫైన‌ల్ గా కృషి, ప‌ట్టుద‌ల‌, ఫ్యామిలీ మ‌ద్ద‌తుతో ఈ స్థాయికి రాగ‌లిగాను. న‌టిగా నా ప్రయాణం ఎన్నో పాఠాలు నేర్పింది` అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.