రాజమౌళి కెరియర్లో నష్టాలు తెచ్చిన ఏకైక చిత్రం ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాజమౌళి.. రాజమౌళితో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శకనిర్మాతలు నటీనటులు సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇటి వలె తన పేరును సైతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే ఇప్పటివరకు రాజమౌళి కెరియర్లో ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. రాజమౌళి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడు ఆయన సీరియల్ డైరెక్టర్ గా మొదటిసారి తన కెరీయర్ని ప్రారంభించారు.

Sye (2004 film) - Alchetron, The Free Social Encyclopedia
అటు తరువాత డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవక్షణలో 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమయ్యారు.అలా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రాజమౌళి ఆ తరువాత 20 సంవత్సరాలలో మొత్తం 12 చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి భారీ విజయాన్ని అందుకున్నాయి. రాజమౌళి కెరియర్ లో అసలు ప్లాప్ అన్న పదమే హిస్టరీలోనే లేదని చెప్పవచ్చు . అలాగే దేశాన్ని ఎన్నో ఏళ్లుగా కలలుగా మిగిలిపోయిన ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది RRR చిత్రంతో.

SS Rajamouli retrospective: Sye – A bolder filmmaker takes generous amount of inspiration from Any Given Sunday | Opinion-entertainment News, The Indian Express

అయితే రాజమౌళి తీసిన చిత్రాలన్నీ నిర్మాతలకు ఎన్నో లాభాలను తెచ్చిపెట్టాయి. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందు వస్తు ఉంటారు. అయితే రాజమౌళి కెరియర్లో ఒక చిన్న మచ్చగా మిగిలిపోయిన చిత్రం ఏమిటంటే సై.. ఈ చిత్రం 2004 సెప్టెంబర్ 23న రిలీజ్ అయింది ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న దాదాపుగా రూ .8కోట్ల రూపాయలతో ఈ సినిమాని నిర్మించారట. కానీ ఇది లాంగ్ రన్ లో కేవలం రూ .12 కోట్ల మాత్రమే రాబట్టింది. దీంతో ఆశించిన స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చి పెట్టలేదు.