వైసీపీకి ఓటింగ్ శాతం మైనస్‌లో..జనసేనకే కలిసిందా?

గత ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం అందిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి 151 సీట్లు వచ్చాయి. ఇక దాదాపు 50 శాతం ఓటింగ్ పడింది. ఇటు టి‌డి‌పికి 40 శాతం ఓటింగ్ వచ్చింది. జనసేనకు 6 శాతం వరకు ఓట్లు పడ్డాయి..అయితే భారీగా ఓట్ల శాతం పొందడంతో వైసీపీ విజయం అందుకుంది. మరి ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి అలాంటి విజయమే దక్కుతుందా? నో డౌట్ ఈ సారి మాత్రం అలాంటి విజయం దక్కదనే చెప్పాలి.

ఎందుకంటే గత ఎన్నికల్లో పరిస్తితులు వేరు..టి‌డి‌పిపై వ్యతిరేకత, జనసేన ఓట్లు చీల్చడం, జగన్ ఒక్క ఛాన్స్..ఇలాంటి అంశాలతో వైసీపీకి భారీ విజయం దక్కింది. ఇప్పుడు సీన్ మారింది. వైసీపీపై వ్యతిరేకత ఉంది. ఇటు టి‌డి‌పి, జనసేన బలపడుతున్నాయి. అదే విధంగా ఆ రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీకి రిస్క్ ఎక్కువ ఉంది. అయితే వైసీపీకి ఈ సారి భారీగా ఓట్ల శాతం తగ్గిందని అంటున్నారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్..జనసేనకు ఓటింగ్ శాతం పెరిగిందని చెబుతూనే..వైసీపీకి ఓట్ల శాతం తగ్గిందని చెప్పారు. వైసీపీకి దాదాపు 13-14 శాతం ఓట్లు తగ్గాయని అన్నారు. మామూలుగా జనసేనకు ఓట్లు పెరగాలంటే ఏదొక పార్టీకి ఓట్లు తగ్గాలని..దాదాపు వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందని చెప్పుకొచ్చారు. కాకపోతే ఆ ఓట్లు అన్నీ జనసేనకు వస్తాయనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

వైసీపీకి తగ్గిన ఓట్ల శాతంలో కొంతమేర జనసేనకు వెళితే..కొంత టి‌డి‌పికి వెళ్ళాయని తెలుస్తుంది. అయితే టి‌డి‌పి, జనసేన కలిసి పనిచేస్తే మాత్రం సీన్ మారిపోతుంది. వైసీపీకి గెలుపు గగనం అవుతుంది. ఇక పొత్తుల బట్టే వైసీపీ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.