పెళ్లికి ముందే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మధ్య గొడవలా..?

టాలీవుడ్లో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ ఉంటుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మొదట అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించిన స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది. గడచిన మూడు సంవత్సరాల నుంచి హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉండేవి.. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం వీరి ఎంగేజ్మెంట్ కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది.

Rumoured couple Varun Tej and Lavanya Tripathi to get engaged in June 2023?  - India Today
ఒకరినకరు బాగా అర్థం చేసుకున్న తర్వాతే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఏడేళ్ల పాటు డేటింగ్ చేసి వివాహం చేసుకోబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే గతంలో వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి మధ్య ఒక్క హీరో విషయంలో చిన్నపాటి గొడవలు జరిగాయట. విజయ్ దేవరకొండ నటించిన ఒక సినిమాలో ముందుగా రష్మిక కాకుండా లావణ్య త్రిపాఠినే డైరెక్టర్ పరుశురామ్ సంప్రదించారట.. అయితే కథ పరంగా బాగున్నప్పటికీ ఇదే విషయాన్ని వరుణ్ తేజ్ కి చెప్పగా విజయ్ దేవరకొండ అంటే కచ్చితంగా లిప్ లాక్ లు ఉంటాయి అలాంటి సన్నివేశాలు నువ్వు నటించడం నాకు ఇష్టం లేదని చెప్పారట.

అయితే ఇందులో కేవలం ఒకే ఒక్క లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది ఈ సినిమా తన కెరీర్ కు చాలా ఉపయోగపడుతుందని చెప్పిన వరుణ్ తేజ్ ఒప్పుకోలేదట. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ చివరికి వరుణ్ తేజ్ చెప్పిన మాటలను విని లావణ్య త్రిపాఠి ఆ సినిమా వదులుకున్నదట. ప్రేమించుకుంటున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు సమాచారం. ఇందులో నటించిన వారంతా స్టార్ పొజిషన్లో ఉన్నారు ఒకవేళ లావణ్య త్రిపాఠి ఇందులో నటించి ఉంచి ఆమె కూడా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించేదని అభిమానులు భావిస్తున్నారు.