కేజిఎఫ్ సినిమాతో సలార్ కనెక్షన్.. క్లారిటీ ఇదే..!!

బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ ఆన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించారు. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాలు విడుదలై అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది పురుష్.. చిత్రం విడుదలైన విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటన పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ చిన్నచిన్న మిస్టేక్స్ వల్ల ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది కానీ కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు చేస్తున్నట్లు సమాచారం.

KGF Chapter 2: Prabhas' Salaar Is Being Used To Bag More Money For The Yash Starrer?
ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంతనిల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే కాకుండా చాలామంది నటీనటులు నటించడంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడుతోంది.ఈ చిత్రంలో మరొకసారి ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ ఇవ్వడం జరిగింది మేకర్స్. గత కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది..

ప్రస్తుతం షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్ర బృందం ఈ సినిమా థియేటర్లోకి రావడానికి ఇంకా వందరోజులే సమయం ఉందంటూ ఒక పోస్టర్ని విడుదల చేశారు.. ఈ పోస్టర్లో ప్రపంచానికి సిపిఆర్ పెట్టాల్సిన సమయం వచ్చిందంటూ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టర్ తో మరొకసారి కేజిఎఫ్ సినిమాకు కనెక్షన్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లు కొన్ని బాక్సులు కనిపించాయి వాస్తవానికి పోస్టర్ డార్క్ గా ఉండడం వల్ల అవి కనిపించలేదు కాస్త బ్రైట్నెస్ పెంచి చూస్తే అందులో కొన్ని బాక్సులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఆ బాక్స్ లో కేజిఎఫ్-2 లో రాఖీ బాయ్ సముద్రంలో పడేసిన బంగారు బాక్సులు అన్నట్లుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా కేజిఎఫ్ సలార్ సినిమా కు కనెక్షన్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఈ తాజా పోస్టర్లు ఆ బాక్సులు కనిపించడంతో అభిమానుల సైతం ఇలా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.