వాటి మీద మోజుతో పెళ్లి కి దూరమవుతున్న హీరోయిన్స్..!!

సినీ ఇండస్ట్రీలో నైనా సామాన్య ప్రజలైన సరే ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి… అయితే కొంతమంది హీరోయిన్లు సైతం పెళ్లి వయసు దాటిపోయిన వివాహం చేసుకోకుండా ఉన్నారు. మరి కొంతమంది మాత్రం వివాహం వరకు వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. సీనియర్ హీరోయిన్ల విషయానికి వస్తే రమ్యకృష్ణ, రోజా, రంభ ,జ్యోతిక, నమిత తదితర హీరోయిన్ల సైతం వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. కాజల్ అగర్వాల్ తదితర నటీనటులు సైతం వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. కానీ కొంతమంది హీరోయిన్స్ ఏజ్ బార్ అవుతున్న కూడా వివాహం చేసుకోకుండా ఉన్నారు.వారి గురించి తెలుసుకుందాం.

Anushka decided not to leave Trisha Krishnan
ముఖ్యంగా ఇలాంటి వారిలో గుర్తుకు వచ్చే పేర్లలో అనుష్క, త్రిష , తమన్నా,అంజలి తదితర హీరోయిన్ల పేర్లు గుర్తుకు వస్తాయని చెప్పవచ్చు. త్రిష గతంలో ఒక వ్యక్తితో నిశ్చితార్థం వరకు వెళ్లి ఆ తర్వాత వివాహాన్ని రద్దు చేసుకుంది.మూడు పదుల వయసు దాటినా సరే ఇంకా ఈమె వివాహం చేసుకోలేదు. అనుష్క గురించి పెళ్లి వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ప్రభాస్ తో అన్నట్టుగా వార్తలు వినిపించడమే కాకుండా ఆ తర్వాత బిజినెస్ మాన్ తో పెళ్లి కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

ఇక హీరోయిన్ తమన్నా తాజాగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ప్రకటించింది. మరొక హీరోయిన్ విమల రామన్ ఈమె కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వివాహానికి నోచుకోలేదు. వీరే కాకుండా అంజలి ,రకుల్ ప్రీతిసింగ్, కూడా త్వరలోనే వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక గతంలో ఒక నటుడిని ప్రేమించి నిశ్చితార్థం చేసుకొని వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంది. వీరి బాటలోనే హీరోయిన్ మెహ్రిన్ కూడా వివాహాన్ని రద్దు చేసుకుంది.. అయితే వీరంతా కేవలం సినిమాల మీద మోజుతోనే ఇలా నిశ్చితార్థమైన తర్వాత వివాహాన్ని రద్దు చేసుకోగా మరి కొంతమంది వివాహానికి దూరంగా ఉంటున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.