గుంటూరులో వైసీపీ సీట్లు ఫిక్స్..వారికే డౌట్!

రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్న రెండో రాష్ట్రం గుంటూరు..ఈ ఉమ్మడి జిల్లాలో 17 సీట్లు ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువ సీట్లు ఉన్న ఈ జిల్లాల్లో మళ్ళీ సత్తా చాటాలని వైసీపీ చూస్తుంది. ఈ క్రమంలోనే మళ్ళీ గుంటూరులో అదిరిపోయే విజయాన్ని అందుకోవాలని వైసీపీ చూస్తుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 17 సీట్లు ఉంటే వైసీపీ 15 సీట్లు గెలుచుకుంది. ఇక టి‌డి‌పి 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో ఒక ఎమ్మెల్యే వైసీపీ వైపు జంప్ కొట్టారు. దీంతో వైసీపీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయితే ఈ సారి కూడా జిల్లాలో ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే జిల్లాలో సీట్లని ఖరారు చేసే పనిలో ఉంది. కాకపోతే ఈ సారి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని తెలుస్తోంది. కొందరికి సీట్ల విషయం క్లారిటీ లేదు. జిల్లాలో పక్కాగా సీట్లు ఫిక్స్ అనుకునేవారు వచ్చి..మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసారావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గురజాలలో కాసు మహేశ్ రెడ్డి..ఈ ముగ్గురుకు మళ్ళీ సీట్లు ఫిక్స్.

ఇక పెదకూరపాడులో నంబూరు శంకర్ రావు, గుంటూరు వెస్ట్ లో మద్దాలి గిరి, గుంటూరు ఈస్ట్ లో ముస్తఫా లేదా ఆయన తనయురాలు. తాడికొండలో డొక్కా మాణిక్యవరప్రసాద్, చిలకలూరిపేటలో విడదల రజిని..వీరికి దాదాపు సీటు ఫిక్స్. వేమూరులో మేరుగు నాగార్జున, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, ప్రత్తిపాడులో సుచరిత మళ్ళీ బరిలో దిగనున్నారు.

అయితే సత్తెనపల్లి, మంగళగిరి, బాపట్ల, వినుకొండ, పొన్నూరు లాంటి సీట్లలో ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు.