‘మా నమ్మకం నువ్వే జగన్’..జనం అనుకుంటున్నారా?

ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలని చెప్పి కష్టపడుతున్నారు. అయితే పూర్తిగా ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడి ఆయన ముందుకెళుతున్నారు. అవే తమని గెలిపిస్తాయని అనుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేని గడపగడపకు పంపించి..పథకాల లబ్దిదారులతో మాట్లాడిస్తున్నారు. ఇక పథకాల ద్వారా ఇంత లబ్ది జరిగిందని ప్రజలకు చెబుతున్నారు.

ఇక గడపగడపకు తర్వాత మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే పథకాలు అందిన ఇళ్లకు వెళ్ళి..వాళ్ళ ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ అంటిస్తున్నారు. అంటే ప్రజల నమ్మకం జగన్ అనే విధంగా వైసీపీ ప్రచారం చేస్తుంది. అలాగే మా భవిష్యత్ నువ్వే జగనన్న అని, జగనన్నకు చెబుదాం అంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. వైసీపీ కార్యక్రమాలు చేస్తుంది బాగానే ఉంది గాని..మరి జనం మా నమ్మకం నువ్వే జగన్ అని అనుకుంటున్నారా? అంటే..చెప్పలేని పరిస్తితి.

అసలు పథకాలు అందని వారు అలా అనుకోవడం లేదనే చెప్పాలి..అందులో ఎలాంటి డౌట్ లేదు. వారంతా అభివృద్ధి కోరుకుంటున్నారు. అభివృద్ధి ఏమో ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇక పథకాలు అందుతున్న వారు కూడా అలాగే అనుకుంటున్నారా? అంటే అది కష్టమే..ఎందుకంటే పథకాల లబ్ది దారులు కొందరే..జగన్ ని నమ్ముతున్నారు..మిగిలిన వారు నమ్మడం కష్టం. ఎందుకంటే పథకాలు ఇస్తున్నారు గాని..పన్నుల పేరిట ఇంకా ఎక్కువ మొత్తం లాగుతున్నారనే విషయం ప్రజలకు అర్ధమవుతుంది.

కాబట్టి మా నమ్మకం నువ్వే జగన్ అనేది పూర్తిగా వర్కౌట్ అయ్యేలా లేదు. కాకపోతే వైసీపీ నేతలు వచ్చి ఇంటికి స్టిక్కర్లు అంటిస్తే..వద్దని అంటే కాస్త ఇబ్బందులు పడాలి..కాబట్టి స్టిక్కర్లు అంటించిన పట్టించుకోవడం లేదు.