సెంటిమెంట్ అస్త్రాలతో జగన్..వర్కౌట్ అవుతాయా?

రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది ఒకోసారి వర్కౌట్ అవుతుంది..నాయకుల పండించే సెంటిమెంట్‌కు ప్రజలు లొంగుతారు. దీంతో ఆ నాయకులకు బెనిఫిట్ అవుతుంది. అయితే ఎల్లకాలం అదే సెంటిమెంట్ నమ్ముకుని బండి నడిపించడం అనేది కష్టమైన పని. ఇక సెంటిమెంట్ పునాదులు మీద పుట్టిన వైసీపీ సైతం..అదే సెంటిమెంట్ రాజకీయాలని నమ్ముకుని ముందుకెళుతుంది. జగన్ పూర్తిగా ప్రజల్లో సెంటిమెంట్ లేపి..రాజకీయంగా లబ్ది పొందడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది.

వైఎస్సార్ సెంటిమెంట్ తోనే వైసీపీ వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఆ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది..కానీ తర్వాత 2014 ఎన్నికల్లో వర్కౌట్ కాలేదు. ఇక 2019 ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అని జగన్ పెద్ద స్థాయిలో సెంటిమెంట్ లేపారు. పైగా టి‌డి‌పి సైతం జగన్‌ని ఎక్కువ టార్గెట్ చేయడంతో ఆయనపై జనాల్లో సింపతీ పెరిగింది. జనం సైతం జగన్ కు ఒక్క ఛాన్స్ ఇద్దామని చెప్పి వైసీపీకి ఓటు వేసి గెలిపించారు. అలా అధికారంలోకి వచ్చిన జగన్…తన పాలనతో మెప్పించడం కంటే..పథకాలపైనే ఆధారపడ్డారు.

అలాగే తాను ఎంతసేపు ఒంటరిగా పోరాడుతున్నానని, తనపై తోడేళ్లు గుంపు దాడి చేస్తుందని చంద్రబాబు, పవన్…టి‌డి‌పి అనుకూల  మీడియాని టార్గెట్ చేస్తున్నారు. అదేమంటే తనకు సొంత మీడియా గాని, పత్రిక గాని, సోషల్ మీడియా గాని లేదని జగన్ ప్రజలకు చెబుతున్నారు. అంటే ఇదో రకమైన సెంటిమెంట్ అని చెప్పవచ్చు.

కానీ ఇది వర్కౌట్ అవ్వడం కష్టం..ఎందుకంటే జగన్ కు సొంత మీడియా, పత్రిక, సోషల్ మీడియా ఉందని జనం అందరికీ తెలుసు.సపోర్ట్ మీడియా కూడా ఉందని తెలుసు. అయితే జగన్ పాలన పూర్తిగా బాగుంటే..ప్రతిపక్షాలు కావాలని టార్గెట్ చేస్తున్నాయని అనుకోవచ్చు. కానీ అలాంటి పరిస్తితి లేదు. కాబట్టి జగన్ సెంటిమెంట్ అస్త్రాలు అనుకున్న మేర వర్కౌట్ అయ్యేలా లేవు.