సీజన్ -2 మరింత బోల్డ్ గా.. రానా నాయుడు..!!

వెంకటేష్ , రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు.. ఇంతవరకు వీరిద్దరూ కలిసి సినిమాలలో నటించలేదు. కానీ డైరెక్ట్ గా వెబ్ సిరీస్లో నటించడం జరిగింది. హాలీవుడ్ సిరీస్ రెడోనోవన్ అనే సిరీస్ ను రీమేక్ గా తెరకెక్కించారు రానా నాయుడు.. కుటుంబ సభ్యుల మధ్య ఉండే సమస్యలకు క్రైమ్ యాక్షన్ మాఫియా డ్రగ్ అంశాలను కూడా జోడించడం జరిగింది ఈ సిరీస్లో.. ఇది కూడా నెమ్మదిగా ప్రారంభమై.. కథ ముందుకు వెళ్లే కొద్ది స్క్రీన్ ప్లే రిసీ గా మారిపోతుంది.

Rana Naidu review: Rana Daggubati and Venkatesh star in an unpalatable  series | Entertainment News,The Indian Express
కుటుంబ సభ్యుల మధ్య ఉండే సన్నివేశాలను ఆసక్తికరంగా ఎమోషనల్ గా చూపించడం జరుగుతోంది. ముఖ్యంగా రానా ,వెంకటేశుల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా ఎమోషనల్ గా ఉన్నాయి.ఇందులో భాష సన్నివేశాలు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు రెగ్యులర్గా చూసే వాళ్ళకి సాధారణంగానే ఉంటుంది కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం కాస్త ఎబ్బేట్టుగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .ఈ సినిమా ప్రమోషన్స్ లో ముందే తెలియజేయడం జరిగింది.

Rana Daggubati, Venkatesh Daggubati Are Back with 'Rana Naidu'

ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల పాటు ఉంటుంది. మొత్తం పది ఎపిసోడ్లు అంటే దాదాపుగా 500 నిమిషాలు ఉంటుందన్నమాట.. కానీ ప్రారంభం ఎపిసోడ్లు తర్వాత స్టోరీ వేగం పుంజుకుంటుంది. ఈ కథ ప్రత్యేకత ఏంటని కేవలం రెండు పాత్రల మధ్య చుట్టూ తిరగడం అన్నట్లుగా తెలుస్తోంది.మొదటి సీజన్కు కంటిన్యూగా రెండవ సివిజన్ రాబోతోంది అంటు తాజాగా అందుకు సంబంధించి నెట్ ఫ్లెక్స్ స్వయంగా తెలియజేసింది. త్వరలోనే సెకండ్ సీజన్ విడుదల కాబోతోంది రానా నాయుడు అంటూ తెలియజేసింది. అందుకు సంబంధించి వీడియో విడుదల చేయగా ఇందులో మరింత బోల్డునెస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. మొదటి సీజన్ తెలుగు వర్షన్ ని డిలీట్ చేయడం జరిగింది. మరి ఈ రెండవ సీజన్లో ఎలా చూపిస్తారో చూడాలి మరి.

https://twitter.com/NetflixIndia/status/1648544450749124609?s=20