పూజలు చేయిస్తున్న యాంకర్ సుమ.. కారణం అదేనా..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది యాంకర్ సుమ.. ఇక ఈమె భర్త రాజీవ్ కనకాల కూడా ఒక యాక్టర్ అన్న విషయం తెలిసిందే ..ఎన్నో సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ మంచి విజయాలను అందుకున్నారు. సుమ యాంకర్ గా మరొకవైపు నటిగా కూడా పేరు సంపాదించింది. సుమ బుల్లితెరపై కార్యక్రమాలను ఈ మధ్యకాలంలో కాస్త తగ్గించి ఎక్కువగా సినీ ఈవెంట్ల వైపు అడుగులు వేస్తోంది. ఇలా వృత్తిపరంగా వీరిద్దరూ జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సంతోషంగానే ఉంటారు.

గడిచిన కొన్ని నెలల క్రితం సుమ, రాజీవ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయని దీంతో వీరిద్దరు విడిపోతున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి.ఈ విషయంపై కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. వీరికి కుమారుడు రోషన్, ఒక కూతురు కూడా ఉన్నది. ప్రస్తుతం తన కుమారుడిని ఇండస్ట్రీలోకి హీరోగా రాణించేందుకు పలు ప్రయత్నాలు అయితే చేస్తున్నది. అందుకోసం ఒక సినిమాను కూడా సిద్ధం చేసింది..ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి విషయాలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే సుమ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఇందులో సుమ దంపతులు ఇద్దరు కూడా సాంప్రదాయమైన దుస్తులను ధరించి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పూజ సుమ ఇంట్లోనే నిర్వహించినట్లు తెలుస్తోంది. కుటుంబ సంక్షేమం కోసమే సుమ దంపతులు ఈ పూజ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.