మంచు లక్ష్మిపై సంచలన కామెంట్లు చేసిన భూమా మౌనిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు వారసుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది.ముఖ్యంగా దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక ను ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరికీ ఇది రెండవ పెళ్లి.. దీంతో సినీ,రాజకీయ రంగంలో పెద్ద చర్చనీ అంశంగా మారింది.ఈ పెళ్లి తర్వాత మంచు కుటుంబంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు కూడా తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి.

Manchu Manoj & Bhuma Mounika visited Tirumala Tirupati Devasthanam
తాజాగా ఒక టెలివిజన్ టాక్స్ షో కి హాజరైన ఈ జంట వీరిద్దరి ప్రేమ పెళ్లి విషయంలో ఎదుర్కొన్న సంఘటనలను కూడా తెలియజేసింది. వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో లో పాల్గొనడం జరిగింది.. మనోజ్ మాట్లాడుతూ నేను మౌనిక కలిసి నడుద్దాం అనుకున్న సమయంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి.. అవన్నీ చెప్పడానికి ఈ సీజన్ కూడా సరిపోదు అంటూ తెలిపారు.మా లైఫ్ మాట్లాడుకునేంత ఈజీగా సాగలేదని కూడా తెలిపారు.. మా ప్రేమ పెళ్లి ప్రయాణంలో మా అక్క, అమ్మ ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది అని తెలిపారు మంచు మనోజ్.

Manchu Manoj – Bhuma Mounika : Manchu Lakshmi is another mother to me.. Bhuma  Mounika!
మా ఇద్దరికీ వారిద్దరి అండగా నిలబడ్డారు మా ఇద్దరి పెళ్లి బాధ్యత మొత్తం అక్కే తీసుకుంది అని తెలిపారు నావల్ల వారిద్దరూ చాలా బాధపడ్డారని ఫీల్ అయ్యారని అప్పుడే అనుకున్నం జీవితంలో అమ్మ ,అక్కకి కష్టం రాకుండా చూసుకోవాలని తెలిపారు.ఇదే షోలో మౌనిక మాట్లాడుతూ మంచు లక్ష్మితో తనకి చాలా మంచి అనుబంధంగా ఉందని ఆమె నాకు సిస్టర్ అండ్ ఫ్రెండ్ గానే కాకుండా అమ్మ స్థానంలో నిలబడింది.నన్ను ఒక చిన్న పిల్లల ట్రీట్ చేయడం జరిగింది.ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె నాకు అన్ని అంటూ తెలిపింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.