తారక్ నెక్స్ట్ మూవీకి ముహూర్తం ఫిక్స్.. ఆసక్తిని రేపుతున్న పోస్టర్!

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు అందుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రానున్న విషయం మనందరికీ తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది.

ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై నందమూరు కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కే.హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవాని మార్చ్ 23 న జరుపనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కి సంబంధించిన కొన్ని సీన్స్ ని షూట్ చెయ్యడానికి హైదరాబాద్ చివర్లో కోర్ట్ సెట్‌ను నిర్మించారు. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయితే ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాం అని చిత్ర బృందం ప్రకటించారు.

ఇదిలా ఉండగా ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2023లో, ఎన్టీఆర్ 30లో తన రోల్ గురించి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పని చేయాలనే తన కోరికను నిజం చేసుకోవాలని ప్రతిరోజూ ప్రార్థిస్తున్నానని చెప్పింది. ప్రతి ఇంటర్వ్యూలో, ఆమె జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తం చేసింది. పదేపదే కోరుకుంటే పంచభూతాలు కోరికను నెరవేరుస్తాయని ఆమె నమ్ముతుంది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద సంతోషాలలో ఒకటి అని ఆమె పేర్కొంది.

Share post:

Latest