కబ్జా మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే..

సిల్వర్ స్క్రీన్ పై గత కొద్ది నెలలుగా కన్నడ చిత్రాల హవా నడుస్తోంది. కేజీఎఫ్ 2 రికార్డులను తిరగరాస్తే కాంతారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తాజాగా మరో కన్నడ చిత్రం కబ్జా విడుదల అయింది, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కన్నడ చిత్రాల విజయ పరంపరకు ఈ కబ్జా చిత్రం బ్రేక్ వేసినప్పటికీ వసూళ్ల పరంగా పర్వాలేదనిపించింది. కిచ్చా సుదీప్, శివ రాజ్ కుమార్, శ్రియ శరణ్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజ తారాగణం ఉన్నా కథ మాత్రం బోరింగ్ గా ఉండటంతో దీనికి ఫ్లాప్‌ టాక్ వచ్చింది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కలెక్షన్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మొదటి రోజు నైజాంలో రూ .18 లక్షలు, సీడెడ్ ఏరియాలో రూ.9 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ లో రూ.17 లక్షలు, ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ మొత్తం కలుపుకొని.. రూ.44 లక్షల రూపాయలు, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తంగా రూ. లక్ష రూపాయలు అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు రూ.45 లక్షలు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 1.2 కోట్లు సాధించాల్సి ఉంది. మొదటి రోజు రూ 44 లక్షలు సాధించడంతో ఇంకా రూ 75 లక్షలు సాధించాల్సి ఉంది. సినిమా విడుదలైన రెండవ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. మొత్తం మీద, కబ్జా ఒక బోరింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా వచ్చి డిసప్పాయింట్ చేసింది. ఉపేంద్ర పర్ఫామెన్స్, సినిమాటోగ్రఫీ తప్పితే ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఏవీ లేవు. ఈ నేపథ్యంలో వీకెండ్ లో అయినా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ అవుతుందేమో చూడాలి.