ప్రభాస్ -ఎన్టీఆర్ నటించిన ఆ రెండు సినిమాలకు లింక్ ఏంటి..!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా చేసిన చాలా వరకు సినిమాలు మంచి విజయాలే అందుకున్నాయి. ఇక తన పెదనాన్న కృష్ణంరాజు పేరుని నిలబెడుతూ టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ విషయం ఇలా ఉంచితే టాలీవుడ్ లో మరో స్టార్ నందమూరి కుటుంబం నుంచి మూడో తరం న‌ట వారసుడిగా వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన తాతకి తగ్గ మనవడిగా తనదైన రీతిలో సినిమాల్లో నటిస్తూ విమర్శకుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు.

ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ప్రభాస్- ఎన్టీఆర్ ఇద్దరు హీరోలు నటించిన రెండు సినిమాల కథలు ఆల్మోస్ట్ ఓకే విధంగా ఉంటాయి. అవి ఏమిటంటే ప్రభాస్ నటించిన రెబల్ సినిమా మరియు ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్య.. ఈ రెండు సినిమాలు కూడా కొద్ది గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రభాస్ నటించిన రెబెల్ సినిమాను లారెన్స్ తెరకెక్కించగా.

ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్య సినిమాని హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ రెండు సినిమాల్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ చనిపోతే హీరో విలన్స్ మీద రివేంజ్ తీర్చుకోవడం కోసం మరో హీరోయిన్ ను లవ్ చేస్తాడు. ఇక ఈ రెండు సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్స్ నాన్నలే విలన్స్ గా ఉండటం మనం గమనించవచ్చు.. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్లు గా మిగిలిపోయాయి.

Share post:

Latest