ప‌వ‌న్ నాలుగు మీటింగులు.. రెండు డైలాగుల‌పై ఇదే హాట్ టాపిక్‌..!

“ఔను.. మేం ఆయ‌న‌ను న‌మ్ముతాం. వెంట ఉంటాం. కానీ, ఆయ‌న మా వెంట ఉండాలి క‌దా!ఏదొ ఒక‌టి రెండు స‌మ‌స్య‌ల‌ను ఇలా ట‌చ్ చేసి అలా వెళ్లిపోతే.. మా ప‌రిస్థితి ఏంటి? త‌ర్వాత మేం ఎవ‌రితో చెప్పుకోవా లి? .. రోడ్ల‌న్నారు.. ఏదో వ‌చ్చారు. అలా హ‌డావుడి చేశారు వెళ్లిపోయారు. త‌ర్వాత‌.. ఎస్సీల‌పై దాడులు అన్నారు. అది కూడా అలానే చేశారు. మ‌రి ఎలా న‌మ్మాలి?“ ఇదీ.. ఒక ఆన్‌లైన్ చానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌పై ప్ర‌జ‌లు కుండ‌బ‌ద్ద‌లు కొట్టి చెప్పిన మాట‌.

JSP To Contest Only For Parliament | cinejosh.com

పైకి అభిమానులు.. ఎన్ని అంశాలైనా చెప్పుకోవ‌చ్చు. వారుప‌వ‌న్‌కు జేజేలు కొట్టొచ్చు. కానీ.. ప‌వ‌నే చెప్పుకొ న్న‌ట్టు.. వారు పోలింగ్ బూత్ వ‌ర‌కు వ‌స్తున్నారా? ఓటు వేస్తున్నారా? అనేది మిలియన్ డాలర్ల ప్ర‌శ్న‌. వ‌స్తున్నారు మాత్రం.. అనేక కోణాలు చూస్తున్నారు. అనే క అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. వ‌ప‌న్ అయినా.. సీఎం జ‌గ‌న్ అయినా.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు అయినా.. ప్ర‌జ‌లు ఆలోచించే కోణం వేరేగా ఉంది.

ఈ కోణాన్ని ప‌ట్టుకుని.. ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా త‌మ‌నుతాము మ‌లుచుకుని రాజ‌కీయంగా నేనున్నానం టూ భ‌రోసా క‌ల్పించిన నాడే.. ఏ నాయ‌కుడికైనా ప్ర‌జ‌లు వెంట నిలుస్తారు. గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఇదే భ‌రోసా క‌ల్పించారు. త‌ర్వాత‌.. వ‌చ్చిన జ‌గ‌న్ అయినా.. ఇదే ప్ర‌జ‌ల నుంచి రాబట్టుకున్నారు. త‌ను భ‌రోసా క‌ల్పించారు. ఇప్పుడు ప‌వ‌న్ కూడా ఇదే ఫార్ములాను అనుస‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.

pawan kalyan tweets, రాష్ట్రంలో అద్భుతంగా అమలు చేస్తున్నందుకా?.. ప్రజలు  కోరిన మీదటే: పవన్ కళ్యాణ్ - janasena party chief pawan kalyan slams ap  government in twitter - Samayam Telugu

ఇవ‌న్నీ వ‌దిలేసి.. ఏదో నాలుగు మీటింగులు.. రెండు పంచ్ డైలాగుల‌తోనే అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని.. ప్ర‌జ‌లు ఓట్లు వేసేస్తార‌ని ఆశించ‌డం స‌రైంది కాద‌నే అభిప్రాయం మేధావులు కూడా చెబుతున్న మాట‌. మ‌రి ప‌వన్ నిర్దిష్ట‌మైన ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతారో.. లేక‌. పైపై మాట‌లు.. క‌వ్వింపు కామెంట్ల‌తో కాల‌క్షేపం చేస్తారో చూడాలి.