రాజ‌మౌళి త‌న నెక్స్ట్ కు మ‌హేష్ బాబునే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా?

దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రాజ‌మౌళి తండ్రి ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. మహేష్ కు ఇది 29వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎంబి 29` వర్కింగ్ టైటిలతో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం తన నెక్స్ట్ కోసం రాజ‌మౌళి మహేష్ బాబునే ఎందుకు ఎంచుకున్నాడు..? అన్నదానిపై తాజాగా విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ ని కూడా ఇచ్చారు.

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. `చాలా కాలంగా రాజ‌మౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా చేయాలనుకున్నాడు. కానీ అతనికి ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు ఇలాంటి స్టోరీకి మహేష్ బాబు బెస్ట్ ఎంపిక అని అతను భావించాడు. మహేష్ బాబు చాలా ఇంటెన్స్ యాక్టర్. ఏ పాత్రలోకైనా సులభంగా షిఫ్ట్ కాగలడు. అందుకే మ‌హేష్‌ను ఎంచుకున్నాడు` అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ సినిమా రెగ్యూలర్ షూట్ మే లేదా జూన్ నుంచి స్టార్ట్ అవుతుంద‌ని కూడా తెలిపారు.

Share post:

Latest