టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ మూవీ మొఘల్ రామానాయుడు వారసులుగా సినిమాల్లోకి వచ్చిన సురేష్ బాబు, వెంకటేష్ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకటేష్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. సురేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. వీరిద్దరూ తమ కెరీర్ని ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నారు. ఇంత అన్యోన్యంగా ఉండే వీరి మధ్య ఒక విషయం దగ్గర మాత్రం ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయట.
మా ఇద్దరికీ ఫుడ్ విషయంలో ఎప్పుడూ గొడవలు జరుగుతాయని తాజాగా సురేష్ బాబు అన్ స్టాపబుల్ షో లో వెల్లడించాడు. వీటితో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా బాలకృష్ణతో పంచుకున్నాడు. వాటిలో తమ ఆస్తులు విషయాల గురించి కూడా చెబుతూ.. ఇప్పటికీ కూడా మా ఇద్దరి ఆస్తి పంపకాలు జరగలేదని ఇక నేను వెంకటేష్ తో సినిమా చేస్తే అతనికి సగం రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పటం ఇప్పుడు ఇది హాట్ టాపిక్.
వెంకటేష్ నేను ఎంత రెమ్యూనిరేషన్ ఇచ్చినా ఏమీ మాట్లాడడని సురేష్ బాబు అన్నారు. వెంకటేష్ హీరోగా సురేష్ బాబు బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక రీసెంట్గా వెంకటేష్ హీరోగా వచ్చిన పలు సినిమాలను కూడా సురేష్ బాబు నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలను థియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేసిన సమయంలో సురేష్ బాబుపై విమర్శలు కూడా వచ్చాయి. ఇక విమర్శలను కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు.
సురేష్ బాబుని అందరూ కమర్షియల్ ప్రొడ్యూసర్ అని కామెంట్ చేసినా ఆయన తనకు ఆర్థికంగా బెనిఫిట్ కలిగితేనే సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. వీటితోపాటు తన వ్యక్తిగత విషయాలు, తన ఫ్యామిలీ విషయాలు కూడా సురేష్ బాబు బాలకృష్ణతో పంచుకున్నాడు. వీటితోపాటు టాలీవుడ్ లో మహానటి ఎవరు ? అన్న ప్రశ్నకు సమంత అని సురేష్ బాబు సమాధానం ఇచ్చాడు. ఆ కామెంట్ కి అల్లు అరవింద్ కూడా తన అభిప్రాయం అదే అని చెప్పడం గమనారం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.