ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లు నటించారు.
గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాను రష్యాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 8న రష్యాలో పుష్ప రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ రష్మిక లతో సహా పుష్ప టీం రష్యా వెళ్లి అక్కడ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. సినిమాపై భారీ హైట్ ను క్రియేట్ చేస్తున్నారు. అయితే రష్యాలో ప్రమోషన్స్ కోసం మేకర్స్పెడుతున్న బడ్జెట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రష్యాలో డబ్ చేసి సినిమాను విడుదల చేయడానికి మరియు ప్రమోషన్స్ చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నారట. మరి విడుదల తర్వాత ఈ ఖర్చును సినిమా రికవరీ చేస్తుందా లేదా అన్నది చూడాలి.