నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ షో మొదటి సీజన్ భారతదేశంలోనే టాప్ టాక్ షో గా నిలిచింది. ఇక ఈ షో తో బాలకృష్ణ తనలోని కొత్త వ్యక్తిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఇక అక్కడికి వచ్చిన గెస్ట్ లను తనదైన కామెడీ టైమింగ్ తో ఆటపట్టిస్తున్నారు. ప్రస్తుతం రెండో సీజన్ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది.
ఈ సీజన్ కూడా బాలకృష్ణ తన పంచ్లతో, ప్రాసలతో గెస్ట్ ల దగ్గర నుంచి సమాధానం రాబడుతున్నారు. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచి ఎంతో ఉత్కంఠ భరితంగా బాలకృష్ణ షో నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో గెస్ట్లుగా వచ్చిన సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్, శర్వానంద్, అడవి శేష్లను బాలకృష్ణ తన పంచులతో ఎలా ? ఆడుకున్నారో మనకు తెలిసిందే. వీరితోపాటు సీనియర్ రాజకీయ నాయకులను కూడా గెస్ట్లుగా పిలిచి వారిని కూడా తికమక పెట్టారు బాలయ్య.
త్వరలోనే ఈ షోకు ఇద్దరు సీనియర్ భామలు అతిథులుగా రానున్నారని తెలుస్తుంది. రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్ లో టాలీవుడ్ లెజెండ్రీ పర్సన్స్ రాఘవేందర్రావు, సురేష్ బాబు, అల్లు అరవింద్, కోదండరామిరెడ్డి ఈ ఎపిసోడ్ కూడా ఈ శుక్రవారం రాత్రి ఆహాలో స్ట్రీమింగ్ అయింది. రాబోయే ఎపిసోడ్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్, గోపీచంద్ కూడా అతిథులుగా రానున్నారని తెలుస్తుంది.
తన తండ్రి ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ల గా ఉన్న జయసుధ, జయప్రద బాలయ్య షోకు వస్తారని తెలుస్తుంది. వార్తలు పై త్వరలోనే అధికార ప్రకటన రానుందట. ఏదేమైనా బాలకృష్ణ క్రేజ్ రోజురోజుకు అమాంతం పెరుగుతుంది.