పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు క్రిష్ దర్శికత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కూడా హరీష్ శంకర్, సముద్రఖని వంటి దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో అనూహ్యమైన సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ సర్ప్రైజ్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా ప్రకటించాడు.
ప్రభాస్‌తో సాహో సినిమాని తెరకెక్కించిన సుజిత్ తో పవన్ సినిమా చేయబోతున్నట్టు గత కొన్ని రోజులకు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తను నిజం చేసే విధంగా ఈ రోజు ఈ సినిమాపై బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమాను త్రిబుల్ ఆర్ నిర్మించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్‌ను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా ప్రకటించడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో ఊపునిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. అయితే డిజాస్టర్ డైరెక్టర్‌తో పవన్ సినిమా చేయడం మాత్రం ఫ్యాన్స్‌కు కాస్త ఆందోళనగా మారింది. పవన్ వరుసగా ప్లాప్ డైరెక్టర్ల వెంటే పడుతున్నాడు.
We are extremely elated to associate with @PawanKalyan Garu, for our next production.⚡️⭐️
Directed by @SujeethSign, DOP by @DOP007.#FirestormIsComing 🔥🔥 pic.twitter.com/Dd91Ik8sTK
— DVV Entertainment (@DVVMovies) December 4, 2022