బాలయ్య ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. వీరసింహారెడ్డి ఇంటర్వెల్ ట్విస్ట్ ఇదే..!

గోపీచంద్ మలినేని డైరెక్షన్ నట‌సింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకి ‘వీర సింహారెడ్డి’ అనే టైటిల్‌ని కూడా పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ హైదరాబాదులో మొదలైంది. ఈ సినిమాను 2023లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Veera Simha Reddy'గా నందమూరి నటసింహం.. ఇప్పటి నుంచి పూనకాలే.. | Veera Simha  Reddy Official Trailer | NBK 107 Balakrishna ...

బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో చాలా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయట.. ఈ క్రమంలోనే ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీన్ సినిమాకే మరింత ప్రత్యేకంగా ఉంటుందని లేటెస్ట్ టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ లో ఒక‌ యాక్షన్ సీన్ ఉంటుందట.. ఈ సీన్ ద్వార‌ బాలయ్య, శృతిహాసన్ పాత్రలకు సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు బయట పడతాయని తెలుస్తుంది. బాలకృష్ణ అభిమానులకు ఆ సీన్ గూస్ బంప్స్‌ తెప్పించేలా ఉంటుందని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపాడు.

Veera Simha Reddy: I ​​spent A Whole Day In Jail For Balayya.. Fans  Celebrate: Gopichand Malineni

ఈ భారీ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కిలక పాత్రలలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతంతం అందిస్తున్నాడు.

Share post:

Latest