భర్తతో విడిపోయిన త‌ర్వాత బిడ్డ‌ను క‌న్న న‌టి రేవతి.. అప్ప‌ట్లో ఇదో సంచ‌ల‌నం!?

అలనాటి హీరోయిన్ రేవతి.. ఈమె మలయాళం లో `మన్ వాసనై` అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన `మానసవీణ` అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రేవతి కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కించుకుంది.

కేవలం హీరోయిన్ గానే కాకుండా దర్శకురాలిగా కూడా మారి తన కెరీర్లో ఫిలింఫేర్ అవార్డులు, నేషనల్ అవార్డులు ఎన్నో సాధించింది. అయితే సినిమాల్లో నటించే సమయంలోనే ప్రముఖ మలయాళ డైరెక్టర్ సురేష్ చంద్ర మీనన్ తో ప్రేమలో పడింది. అలా కొన్ని రోజులు ప్రేమించుకున్న వీరిద్దరూ 1986లో వివాహం చేసుకున్నారు. అయితే రేవతి పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించాలని చెప్పి పిల్లల్ని కనకూడదు అని తన భర్త సురేష్ కి ఒక కండిషన్ పెట్టిందట.

అలా కొన్ని రోజులు ముగిసాక పిల్లలు కావాలనుకున్న సమయంలో వారికి పిల్లలు పుట్టలేదట. దాంతో వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక ఆ తర్వాత రేవతి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. అయితే రేవతి తన ఎలాగైనా తల్లి కావాలని నిర్ణయించుకోవడంతో తన 48వ పుట్టినరోజు నాడు నేను ఒక బిడ్డకు తల్లా అయ్యాను అంటూ అధికారకంగా ప్రకటించడం అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది.

అయితే భర్తతో విడిపోయిన తర్వాత బిడ్డను ఎలా కన్నది? పైగా ఈ వయసులో అంటూ అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ ప్రశ్నల పై స్పందించిన రేవతి .. తను ఆ పాపకు బయోలాజికల్ మదర్ అని చెప్పింది. ఇక ఈ విషయం తెలిసాక అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే రేవతి IVF పద్ధతితో స్పెర్ముడోనర్ తో ఆ పాపకు జన్మనిచ్చినట్లు తెలిసాక చాలామంది ఆశ్చర్యపోయారు. ఎలానైనా తల్లి కావాలి అనే రేవతి గట్టి ఆశయం ముందు ఆ పాప తండ్రి ఎవరు అనే ప్రశ్న కూడా చిన్న బోయింది. ఇక అప్పట్లో రేవతి ఆ వయసులో తలైందన్న విషయం చాలా వైరల్ గా మారింది.

Share post:

Latest