ఓరి దేవుడో..ఆ సినిమా కోసం రంభ,సిమ్రాన్ కొట్టుకున్నారా..?

ఒక కామెడీ రొమాంటిక్ యాంగిల్ లో తెరకెక్కిన `విఐపి` అనే సినిమాలో అబ్బాస్ మరియు ప్రభుదేవా ఇద్దరూ మెయిన్ హీరోలగా నటించగా వారి సరసున రంభ, సిమ్రాన్ లు హీరోయిన్స్ గా నటించారు. సాధారణంగా ఏదైనా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు లేదా ఇద్దరు హీరోలు ఉన్నారంటే కచ్చితంగా వారి మధ్య ఏదో ఒక గొడవ జరగడం సహజం. ఎందుకంటే ఒకరిని ఎక్కువగా చూపించారని ఇంకొకరికి ఇగో పెరిగి గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సంఘటనే గతంలో సిమ్రాన్ మరియు రంభల మధ్య కూడా జరిగిందట.

అయితే వీరిద్దరూ కలిసి నటించిన `విఐపి` అనే సినిమా షూటింగ్ సమయంలో తరచూ వీరిద్దరి మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూ ఉండేదట. ఈ సినిమాలో వీరిద్దరూ పోటీపడి మరి నటించారట. సినిమాలో ఇద్దరిది ప్రముఖ పాత్రలు అయినప్పటికీ కూడా చిన్న చిన్న విషయాలకే ఇద్దరు ఈగోలకు పోయేవారని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే రంభ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కూడా రంభ కన్నా సిమ్రాన్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న సన్నివేశాలు ఇచ్చే వారిని రంభ డైరెక్టర్ తో గొడవ పడినట్టు అప్పట్లో ఉన్న మీడియా కూడా కూసింది.

రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన ఆ `ఒక్కటి అడక్కు` అనే సినిమాతో రంభ 1992లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే సిమ్రాన్ 1997లో తెలుగు మరియు తమిళ సినిమాలతో ఒకేసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే రంభ సిమ్రాన్ కన్నా ఐదేళ్లు సీనియర్ హీరోయిన్ కావడంతో తన కన్నా చిన్న నటికీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో రంభకు కోపం వచ్చేదని ఆ కోపంతోనే సిమ్రాన్ కి మరియు రంభ కి మధ్య గొడవలు జరిగేవని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.

అంతేకాదు వీరు ఈ సినిమా తర్వాత మరే సినిమాలో కూడా కలిసి కనిపించకపోవడంతో వీరి మధ్య గొడవలు నిజమేనని ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ ఈ వార్తలపై సిమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ రంభకు తనకు ఎలాంటి గొడవలు లేవని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది కావాలనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేశారని అంతే తప్ప వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని.. వారు ఎంతో స్నేహంగా ఉంటారని కూడా చెప్పుకొచ్చింది.

Share post:

Latest