డబ్బు లేకుండా విజయనిర్మలను హోటల్ కు తీసుకెళ్లిన కృష్ణ.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!

సూపర్ స్టార్ కృష్ణ మరియు విజయనిర్మల అప్పట్లో సినిమాలు నటిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందిరా దేవి వంటి అందమైన భార్య ఉన్నప్పటికీ కూడా కృష్ణ విజయనిర్మల వ్యక్తిత్వం నచ్చడంతో ఆమెను ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ వేరువేరు సినిమాల్లో హీరో హీరోయిన్ గా నటిస్తూనే ఉన్నారు.

అంతేకాకుండా విజయనిర్మల ఎక్కడ ఉంటే కృష్ణ అక్కడ ఉండేవాడని అప్పట్లో వారిపై బోలెడన్ని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆమె ఊటీ లో ఉన్న సమయంలో కృష్ణ గారు మద్రాసు నుంచి కారు వేసుకుని వెళ్లిపోయే వారట. అలా ఈ ప్రేమ పక్షులు ఒకరోజు అప్పుడే కొత్తగా వచ్చిన డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ కి వెళ్లారట. అప్పట్లో ఈ రెస్టారెంట్ కి మామూలు క్రేజ్ ఉండేది కాదు.

ఇద్దరూ సెలబ్రిటీలు కావడంతో మామూలుగా హోటల్ కి వెళ్తే అభిమానుల సందడి ఉంటుంది అని ఆ రోజు అలా ప్లాన్ చేసుకున్నారట. అలా వెళ్ళిన వారిద్దరూ ఆ రెస్టారెంట్లో వారికి కావాల్సిన ఫుడ్ తెప్పించుకొని ఫుల్ గా తినేసారట. తీరా మొత్తం తిన్నాక చూస్తే ఇద్దరి దగ్గర డబ్బు లేదట. దాంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఏం చెయ్యాలో తెలియక.. అక్కడ పనిచేసే ఒక పిల్లాడిని తీసుకుని కారులో ఎక్కించుకుని ఇంటికి వెళ్ళాక డబ్బు ఇచ్చి వెనక్కి పంపించారట. ఈ విషయం విజయనిర్మల సరదాగా కృష్ణ గారు బయటకు తీసుకెళ్లి ఇలా ఇబ్బంది పెట్టారంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పటినుండి వారిద్దరూ ఎక్కడికి వెళ్లినా కొంత డబ్బు తీసుకుని వెళ్లడం అలవాటు చేసుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

Share post:

Latest