మరో భారీ స్కెచ్ తో అల్లు అరవింద్.. ఈసారి బ్రహ్మానందం రాబోతున్నాడా..!

టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ ఇటు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో కూడా దూసుకుపోతున్నారు. ఆయన నిర్మాతగా స్థాపించిన గీత ఆర్ట్స్ బ్యానర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ని స్టార్ట్ చేసి వరుస ప్రోగ్రామ్లతో, వెబ్ సిరీస్ లతో కూడా మంచి హిట్ అందుకుంటున్నాడు. ఇక అల్లు అరవింద్ ఎవరు ఊహించిన విధంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఆయన అందులో చేసే షోలు కూడా అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి.

అల్లు అరవింద్ ఎవరు ఊహించిన విధంగా ఆహాలో బాలకృష్ణతో చేసిన ఆన్ స్టాపబుల్ షో ఎంతటి ఘ‌న‌విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ షోకు కొనసాగింపుగా రెండో సీజన్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది. ఇది కూడా మొదటి సీజన్ కంటే భారీ స్థాయిలో రెస్పాన్స్ ను దక్కించుకుంది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అల్లు అరవింద్ ఆహా లో మరో భారీ షోను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

brahmanandam and balakrishna will entertain in unstoppable, balakrishna, allu  aravind, brahmanandam, unstoppable show - Allu Aravind, Balakrishna,  Brahmanandam

ఈ షోకు బ్రహ్మానందం వ్యాఖ్యాతగా ఉండబోతున్నాడని తెలుస్తుంది. ఆ షోకి బ్రహ్మానందాన్ని వ్యాఖ్యాతగాా ఉండమని అల్లు అరవింద్ స్వయంగా వెళ్లి ఆయనను ఒప్పించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆహాలో బ్రహ్మానందం షో కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ షో అనౌన్స్మెంట్ కూడా అతి త్వరలో వస్తుందని తెలుస్తుంది. ఈ షోకి కూడా ఎవరు ఊహించిన విధంగా ఫారెన్ కంట్రీ నుంచి ప్రత్యేకమైన టీం ని కూడా రంగంలోకి దింపారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు అల్లు అరవింద్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో కూడా షో మొదలు పెట్టాడు. ఈ ప్రోగ్రాం కూడా ఈ నెల‌ ఆఖరి నుంచి ఆ హాలో స్ట్రీమింగ్ అవ్వ‌నుంది.

Share post:

Latest